ఎవడు : రామ్ చరణ్ న్యూ లుక్ కేక (ఫోటోలు)
హైదరాబాద్ : మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో 'ఎవడు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు న్యూలుక్ ఫోటలు విడుదలయ్యాయి. ఇందులో చెర్రీ లుక్ ఎంతో సూపర్‌గా, సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. అదే విధంగా చెర్రీకి తగిన పోడీగా శృతి హాసన్, అమీ జాక్సన్ ఆకట్టుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాల స్థలంలో జరుగుతోంది. ఇక్కడ రామ్ చరణ్, శృతి హాసన్‌పై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటల చిత్రీకరణ ప్రముఖ కొరియెగ్రాఫర్ శేఖర్ సమక్షంలో జరుగుతోంది. మాస్‌ను ఆకట్టుకునే విధంగా ఈ సాంగును తెరకెక్కిస్తున్నారు.
'ఎవడు' చిత్రం ఆడియో రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ఖరారైంది. జూన్ 30వ తేదీ ఆడియో వేడుక జరుపనున్నట్లు రామ్ చరణ్ పిఆర్ఓ వెల్లడించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జులై చివరి వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

ఈ చిత్రంలో చెర్రీ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.

ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన ఫుల్ సాంగ్ లీకైన సంగతి మరువక ముందే...తాజాగా మరో సాంగ్ లీకైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘చెలియా చెలియా' అంటూ సాగే ఆడియో ట్రాక్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. షూటింగ్ లొకేషన్లో ఈ సాంగు రికార్డ్ చేసి లీక్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ మ్యూజిక్, ఈ సాంగు మ్యూజిక్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











