రామ్ చరణ్ ‘ఎవడు’ నెక్ట్స్ షెడ్యూల్ డీటేల్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఎవడు' చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ ఖరారైంది. ఇన్ని రోజులు రామ్ చరణ్ పెళ్లి వేడుకల్లో బిజీగా మారడంతో షూటింగుకు బ్రేక్ వేశారు. తాజాగా అన్ని పూర్తయి రామ్ చరణ్ రిలీఫ్ కావడంతో ఈ నెల 28 నుంచి నెక్ట్స్ షెడ్యూల్ షురూ చేయాలని డిసైడ్ అయ్యారు దర్శక నిర్మాతలు.
రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'జంజీర్' షూటింగ్ ప్రారంభం అయ్యే వరకు 'ఎవడు' షెడ్యూల్ హైదరాబాద్‌లో కొనసాగించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం షూటింగులో పాల్గొంటున్నాడు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత, అమీజాక్సన్ రొమాన్స్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా ఉండనుంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర విషయానికొస్తే....గుడిని మింగేవాడుంటే, ఆ గుడిలోని లింగాన్ని కూడా స్వాహా చేసేవాడు ఒకడుంటాడు. ఒక బంతికి ఆరు పరుగులు కొడితే, ఏడో పరుగుకీ దౌడు తీసేవాడొకడు వస్తాడు. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడూ ఉంటాడు. అలాంటివాడే రామ్‌చరణ్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఒకరకంగా ఈచిత్రాన్ని మినీ మల్టీ స్టారర్ మూవీగా చెబుతున్నారు 'ఎవడు' యూనిట్ సభ్యులు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి అద్భుతమైన బాణీలు సమకూర్చుతున్నారు. జనవరిలో ఈచిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











