'ఎవడు' రిలీజ్ డేట్ ఖరారు చేసిన దర్శకుడు
హైదరాబాద్: రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. ఈ చిత్రం ఏప్రియల్ 5,2013 వ తేదిన విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు వంశీ పైడిపల్లి మీడియాకు తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ...''ఈ చిత్రం ఫస్టాఫ్ పూర్తయ్యింది. ఈ నెలలోనే అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ పాల్గొనగా సీన్స్ తీస్తాం. మార్చిలో పాటలను, ఏప్రిల్ 5న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం'' అన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఐటం సాంగ్ ల స్పెషలిస్ట్ అయిన దేవి ఈ చిత్రం కోసం కెవ్వు కేక పాటను మించేలా ఐటం సాంగ్ ని స్వరపరిచారని చెప్పుకుంటున్నారు.
మార్చిలో ఈ చిత్రం ఆడియో విడుదల జరగనుంది. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తైంది. నాలుగు పాటలు రికార్డింగ్ ఇప్పటికే పూర్తైంది. ఐటం సాంగ్ ని షూట్ చేయటం కూడా పూర్తైంది. దాదాపు 15 రోజుల పాటు వైజాగ్ లో మొన్నటికి వరకూ రామ్ చరణ్ పై షూట్ చేసారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా ఉండనుంది. ఆ పాత్ర గురించి మాట్లాడుతూ...గుడిని మింగేవాడుంటే, ఆ గుడిలోని లింగాన్ని కూడా స్వాహా చేసేవాడు ఒకడుంటాడు. ఒక బంతికి ఆరు పరుగులు కొడితే, ఏడో పరుగుకీ దౌడు తీసేవాడొకడు వస్తాడు. అందుకే పెద్దవాళ్లన్నారు తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడూ ఉంటాడని. అలాంటివాడే రామ్‌చరణ్...ఆ పాత్రను ఎవడు చిత్రంలో చూడాలి అంటున్నారు.
దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతూ..''రామ్‌చరణ్‌ని ఓ విభిన్నశైలిలో ఆవిష్కరించే చిత్రమిది. మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కథలో ప్రతి పాత్ర కీలకమే. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అలరిస్తాయని''అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చరణ్, అమీలపై పబ్ నేపథ్యంలో సాగే ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. శోభి నృత్యరీతులు సమకూర్చారు. ఈ చిత్రంలో సమంత ని లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి విలన్ గా మారారు. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. 'మద్రాసు పట్టణం' అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత 'ఏక్ దివానాథా' అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ 'ఎవడు' సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది.


Click it and Unblock the Notifications











