»   » రామ్ చరణ్ ‘ఎవడు’ విడుదల జులై 25న

రామ్ చరణ్ ‘ఎవడు’ విడుదల జులై 25న

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్‌ చరణ్‌, వంశీపైడిపల్లి కాంబినేషన్‌ లో దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'ఎవడు'. ఇటీవలే స్విట్జర్లాండ్, బ్యాంకాక్‌లోని అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలు చిత్రీకరణ పూర్తి చేసుకుని హైదరాబద్ చేరుకుంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు సినిమాకు సంబంధించిన తాజా సమాచారం వెల్లడించారు.

'మా బేనర్లో రామ్ చరణ్ హీరోగా, శృతి హాసన్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రం తెరకెక్కిస్తున్నాం. ఇప్పటికే 90 శాతం టాకీ కంప్లీట్ అయింది. స్విట్జర్లాండ్, బ్యాంకాక్‌లోని అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలు చిత్రీకరణ జరుపుకుంది. మిగిలిన షూటింగ్ భాగాన్ని లోకల్‌లో చిత్రీకరిస్తాము. మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సూపర్బ్ ఆడియోని జూన్ 3వ వారంలో విడుదల చేస్తాము. సినిమా జులైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము' అన్నారు.

'రామ్ ప్రసాద్ అందించిన సినిమాటోగ్రపీ సినిమాకు చాలా ప్లస్సవుతుంది. ఓ ప్రత్యేకమైన పాత్రలో అల్లు అర్జున్, కాజల్ నటిస్తున్నారు. ఓ వైవిద్యమైన కథకి వినూత్నమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు వంశీ తీర్చి దిద్దాడు. ఆద్యంతం థ్రిలింగ్ గా ఉంటూనే అన్ని కమర్షియల్ హంగులతో సిద్ధమవుతున్న మా 'ఎవడు' చిత్రం మెగా అభిమానులను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది' అన్నారు.

సినీ వర్గాల నుంచి తాజాగా అందిన సమాచారం ప్రకారం ఎవడు చిత్రాన్ని జులై 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Mega Power Star Ram Charan’s upcoming film Yevadu will be releasing on July. Audio launch in June 3rd week. Vamsi Paidipalli is directing this action thriller with Shruti Haasan and Amy Jackson as heroines. The film also stars Allu Arjun and Kajal Agarwal in cameo roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu