కేక పుట్టించిన రామ్ చరణ్, అంతా పడిపోయారు (ఫోటోలు)
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో విడుదల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం.....ఎట్టకేలకు జనవరి 12న సంక్రాంతికి కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా విడుదలైన ఈచిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో రామ్ చరణ్ డాన్స్ కేక పుట్టించే విధంగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
16 సెకండ్ల నిడివిగల ఈ టీజర్ డిసెంబర్ 31న యూట్యూబ్‌లో విడుదల చేసారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్‌కు అనుగుణంగా రామ్ చరణ్ స్టెప్పులు వేసిన తీరు అదరహో అనే విధంగా ఉంది. సినిమా విడుదల లేటవడంతో జనాల్లో కాస్త ఆసక్తి తగ్గినట్లు అనిపించినా....తాజాగా విడుదలైన టీజర్‌తో అందరి దృష్టి ఈ సినిమా వైపు మళ్లింది. అందరూ 'ఎవడు' సినిమా మత్తులో పడిపోయారు.
నిర్మాత దిల్ రాజు...సినిమాకు సంబంధించిన సెకండ్ ట్రైలర్ సంధ్యా 70 ఎంఎం థియేటర్లో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ వేడుకకు మెగాఫ్యాన్స్ అందరూ హాజరు కావాలని నిర్మాత విజ్ఞప్తి చేసారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు....

ఎవడు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో తెరకెక్కించిన చిత్రం ‘ఎవడు'.

భారీ అంచనాలు
గత సంక్రాంతికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ సూపర్ డూపర్ హిట్ కావడం, అగ్రహీరోలకి 7వ చిత్రం బ్లాక్ బస్టర్ కావటం సెంటిమెంట్ పరంగా ‘ఎవడు' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే చార్టుబస్టర్‌లో నెం.1 ఆడియోగా ఉండటం విశేషం.

దిల్ రాజు మాట్లాడుతూ..
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...‘ఎవడు' చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నాం. దీనికి సంబంధించిన స్పెషల్ టీజర్‌ని విడుదల చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా తెలుగు సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుంది' అన్నారు.

అల్లు అర్జున్ గెస్ట్ రోల్
అల్లు అర్జున్ పది నిమాషాలు కనిపించినా ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం కనిపిస్తుంది. సినిమా అవుట్‌పుట్ చూసుకుని మా యూనిట్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మా సంస్థలో పక్కా కమర్షియల్ సినిమా ఇది. అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం. రామ్ చరణ్ కెరీర్లో ఇది ఓ మైల్ స్టోన్ అవుతుంది. ఈ సినిమాలో వర్క్ చేసిన వాళ్లందరికీ ఇది బెస్ట్ ఫిల్మ్ గా ఉంటుంది. మెగా అభిమానులందరి అంచనాలుచేరుకునేలా మా ‘ఎవడు' ప్రేక్షకుల ముందుకు వస్తుంది' అన్నారు.

నటీనటులు, టెక్నీషియన్స్
ఈ చిత్రంలో జయసుధ, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, సాయికుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ : వంశీ పైడిపల్లి, వక్కతం వంశీ, మాటలు : అబ్బూరి రివి, కథ సహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, యాక్షన్: సెల్వం, ఆర్ట్ : ఆనంద్ సాయి. సహ నిర్మాతలు: శిరీష్ లక్ష్మణ్, నిర్మాత: రాజు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











