చెర్రీ 'ఎవడు'లో అల్లు అర్జున్ 3 నిమిషాలే

By Pratap

హైదరాబాద్: రామ్‌చరణ్, శ్రుతిహాసన్, ఆమీ జాక్సన్ కాంబినేషన్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన 'ఎవడు' చిత్రం సంక్రాంతికి విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. జనవరి ఒకటిన ఈ చిత్రం స్పెషల్ టీజర్‌ని, మూడున ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు.

Yevadu

ఈ విషయాన్ని నిర్మాత వెల్లడిస్తూ 'మా సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సంకాంత్రికి విడుదల చేస్తున్నాం. ఇది కచ్చితంగా తెలుగు సినిమాని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లే చిత్రమవుతుంది. అల్లు అర్జున్ సినిమాలో పది నిమిషాలే కనిపించినా ఆ ఇంపాక్ట్ సినిమా అంతా కనిపిస్తుంది. రామ్‌చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే సినిమా అవుతుంది. మెగా అభిమానులందరి అంచనాలు చేరుకునేలా సినిమా ఉంటుంది' అని తెలిపారు.

' ఈ సినిమా తొలి కాపీ చూశాం. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. కాజల్ చేసింది చిన్న పాత్రే అయినా చాలా కాలం గుర్తుండిపోతుంది.' అని సహ నిర్మాతలు శిరీశ్, లక్ష్మణ్ చెప్పారు. ఈ చిత్రానికి కథ: వంశీ పైడిపల్లి, వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, కథాసహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్.

మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమా కూడా సంక్రాంతికి విడుదలవుతోంది. ఇద్దరు అగ్రహీరోలు సంక్రాంతికి పోటీ పడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X