ఇక కాల్షీట్లన్నీ ఉపాసనవే: రామ్ చరణ్
హైదరాబాద్ : ''పెళ్లయ్యాక ఇంటి పట్టున ఉన్నది తక్కువ. ఎప్పుడూ షూటింగుల హడావుడినే. నెలకు మహా అయితే నాలుగు రోజులు ఉండేవాణ్నేమో. ఈసారి మాత్రం ఉపాసనకు సమయం కేటాయించాలనుకొంటున్నా'' అంటున్నారు రామ్‌చరణ్.
'ఎవడు', 'జంజీర్' సినిమాల బిజీ షెడ్యూలుతో యేడాది కాలంగా ఆయనకు క్షణం తీరిక లేదు. ఇటీవలే 'జంజీర్' పూర్తయింది. అందుకే కొన్ని రోజులు సెలవు తీసుకొన్నారు. తన కాల్షీట్లన్నీ అర్థాంగి ఉపాసనకు ఇచ్చేశారు.
ప్రస్తుతం చరణ్ సతీసమేతంగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో ఉన్నారు. ఆ తరవాత ఆయన అక్కడే 'ఎవడు' షూటింగ్‌లో పాల్గొంటారు. ఇక శ్రుతిహాసన్ కూడా స్విస్‌లోనే ఉంది. 'ఎవడు'లో శ్రుతి హీరోయిన్ గా నటిస్తుంది.
షూటింగ్‌కి ముందే శ్రుతి స్విస్ వెళ్లింది. కొన్ని రోజులు అక్కడ విరామం తీసుకొంటుంది. ఆ తరవాత 'ఎవడు' షూటింగ్‌లో పాల్గొంటుంది. చరణ్-శ్రుతిలపై రెండు గీతాల్ని తెరకెక్కిస్తారు. అలా వేసవి నుంచి ఈ హీరో,హీరోయిన్స్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











