రామ్ చరణ్ ‘జంజీర్’ ఫస్ట్ లుక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'జంజీర్' అనే హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం ద్వారా చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకు లీక్ అయింది. పక్క ఫోటోలో కనిపించేది ఆచిత్రంలోని దృశ్యమే. ఇందులో చెర్రీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.
రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం గతంలో బిగ్ బి అమితాబ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. తాజా రీమేక్‌లో ఈ చిత్రంతో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం.
జంజీర్ చిత్రం సెకండ్ షెడ్యూల్ మొదలవ్వడానికి మరికొంత కాలం సమయం ఉండటంతో ఆ గ్యాప్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎవడు' షూటింగులో పాల్గొంటున్నాడు మెగా పవర్ స్టార్. వచ్చే నెలలో చెర్రీ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన ప్రేయసి ఉపాసనను పెళ్లాడబోతున్నాడు. జూన్ 14న వీరి వివాహం జరుగనుంది.


Click it and Unblock the Notifications











