twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘తుఫాన్’ సృష్టించబోతున్న రామ్ చరణ్(అఫీషియల్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రానికి తెలుగులో 'జ్వాల' అనే టైటిల్ ఖరారు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తేలింది. ఈ చిత్రానికి 'తుఫాన్' అనే టైటిల్ ఖరారు చేస్తున్నట్లు ఫిల్మ్ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

    ఈ చిత్ర దర్శకుడు అపూర్వ లఖియా తన ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ 'జంజీర్ తెలుగు వెర్షన్‌కు 'తుఫాన్' టైటిల్ ఖరారు చేస్తున్నాం' అంటూ ట్వీట్ చేసారు. టైటిల్ మంచి క్యాచీగా ఉండటం, మెగా పవర్ స్టార్ ఇమేజ్‌కు తగిన విధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది సర్వత్రా.

    అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. బిగ్ బి అమితాబ్ పాతికేళ్ల క్రితం నటించిన 'జంజీర్' చిత్రానికి ఇది రీమేక్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు.

    సోనూసూద్ ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడి షూటింగులో పాల్గొనే స్థితిలో లేక పోవడంతో అతని స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. వేసవి చివర్లో అంటే జూన్ నెలలో ఈ చిత్రం థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం.

    English summary
    Zanjeer's Telugu version title finally confirmed. Zanjeer is Toofan in Telugu. Apoorva took to his micro blogging site and wrote "#Zanjeer in Telugu will officially be called "Toofan" hectic, awesome, congrats" (sic).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X