For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పవన్ రాజకీయం: అది మనసులో పెట్టుకున్నారా? బన్నీ మౌనం.... ఫ్యాన్స్ రచ్చ!

  By Bojja Kumar
  |
  అది మనసులో పెట్టుకున్నారా? బన్నీ మౌనం పై ఫ్యాన్స్ రచ్చ!

  ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ మధ్య 'చెప్పను బ్రదర్' వివాదం రేగిన సంగతి తెలిసిందే. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో రచ రచ్చ చేశారు. చాలా రోజుల తర్వాత మళ్లీ బన్నీ గురించి పవన్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా నెలకొన్న కొన్ని పరిస్థితులే అందుకు కారణం.

   మరోసారి బన్నీని టార్గెట్ చేశారు, ఎందుకంటే?

  మరోసారి బన్నీని టార్గెట్ చేశారు, ఎందుకంటే?

  తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులు బన్నీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ క ళ్యాణ్ రాజకీయాత్ర ప్రారంభించిన నేపథ్యంలో ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది.

  ట్వీట్స్ చేసిన మెగా హీరోలు

  ట్వీట్స్ చేసిన మెగా హీరోలు

  పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర ప్రారంభమైన నేపత్యంలో రామ్‌ చరణ్‌ మరియు మెగా ఫ్యామిలీ హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లు పవన్‌ కళ్యాణ్ కు 'ఆల్‌ ది బెస్ట్‌' చెబుతూ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

   బన్నీ స్పందించక పోవడమే

  బన్నీ స్పందించక పోవడమే

  అయితే అల్లు అర్జున్ మాత్రం పవన్ రాజకీయ యాత్రపై స్పందించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే బన్నీ విషెస్ చెప్పక పోవడాన్ని కొందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ తప్పుబడున్నారు. బన్నీ కూడా విష్ చేసి ఉంటే బావుండేదని, అతడు విష్ చేయక పోవడం వల్ల ..... ఇద్దరి మధ్య ఏదో క్లాష్ ఉందనే సంకేతాలు వెళుతున్నాయని అంటున్నారు.

  అల్లు శిరీష్ కూడా

  అల్లు శిరీష్ కూడా

  బన్నీ కంటే యాక్టివ్‌గా అతడి బ్రదర్ అల్లు శిరీష్ కూడా పవన్ రాజకీయ ప్రవేశంపై స్పందించలేదు. కావాలనే ‘అల్లు' వారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీకి అంటీ ముట్టనట్లు ఉంటున్నారని అభిమానుల్లో చర్చ సాగుతోంది.

   అది మనసులో పెట్టుకున్నారా?

  అది మనసులో పెట్టుకున్నారా?

  అల్లు అరవింద్ మీద పవన్ కళ్యాణ్ ఇటీవల ఆసక్తకర కామెంట్స్ చేశారు. "ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడతావా? అంటూ కొందరు నన్ను ప్రశ్నించొచ్చని కానీ.. తాను అప్పట్లో నిస్సహాయుడ్ని అంటూ ఒక ఉదాహరణను చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఫలానా చోటికి ప్రచారానికి పంపించండి అంటే దానికి అల్లు అరవింద్ స్పందిస్తూ.. ఎందుకండి మనకు అల్లు అర్జున్ ఉన్నాడు.. రామ్ చరణ్ ఉన్నాడుగా.. పంపించేయండి అన్నారని, అప్పట్లో తనకు అర్థమైందేమిటంటే.. అల్లుఅరవింద్ తనను నటుడిగానే చూశారని.. తన కొడుకు.. మేనల్లుడితో పాటు పవన్ కళ్యాణ్ అనే వాడు ఒక నటుడు మాత్రమేనని భావించారు" అని పవర్ స్టార్ వ్యాఖ్యానించారు. బహుషా ఈ కామెంట్స్‌ను మనసులో పెట్టుకుని ‘అల్లు'వారు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు, జనసేనకు దూరంగా ఉంటున్నారా? అని చర్చించుకుంటున్నారు.

  అల్లు అరవింద్ మీద పవన్ కామెంట్స్

  అల్లు అరవింద్ మీద పవన్ కామెంట్స్

  ‘‘అల్లు అరవింద్‌కు తనలో నటుడు మాత్రమే కనిపించాడు. నాలోని సామాజిక స్పృహ కనిపించలేదన్న విషయం అర్థమైంది. అలాంటి వాతావరణంలో తానేం మాట్లాడినా ఎవరు మాత్రం వింటారని.. అందుకే ప్రజారాజ్యంలో ఏం జరుగుతున్నా ఏమీ అనలేక చేతులు కట్టుకొని రోదించేవాడినని.. కన్నీళ్లు కూడా బయటకు వచ్చేవి కావు. ఈ రోజున తనకు బలం ఉంది.. అనుభవం ఉంది. ప్రజారాజ్యం టైంలో తాను చెబితే వినేలా పరిస్థితులు లేవు..... అంటూ పరోక్షంగా అల్లు అరవింద్‌ మీద పవన కళ్యాణ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

   అందుకే ‘అల్లు' వారు దూరంగా

  అందుకే ‘అల్లు' వారు దూరంగా

  తన తండ్రిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన కామెంట్లతో....... ‘అల్లు' వారు అలకబూనారని, అందుకే వారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాత్రపై స్పందించడం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.

   బాబాయ్‌ని విష్ చేసి రామ్ చరణ్

  బాబాయ్‌ని విష్ చేసి రామ్ చరణ్

  రాజకీయ యాత్ర ప్రారంభించిన బాబాయ్ కి అభినందనలు తెలుపుతూ రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్టు చేశారు.

  ఆల్ ది బెస్ట్ చెప్పిన వరుణ్

  ఆల్ ది బెస్ట్ చెప్పిన వరుణ్

  బాబాయ్ పవన్ కళ్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ విష్ చేసిన వరుణ్ తేజ్.

  సాయి ధరమ్ తేజ్

  సాయి ధరమ్ తేజ్

  మీ వెంటే మేము అంటూ సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ సందేశం.

  English summary
  Ram Charan, Sai Dharam Tej, Varun Tej supports Pawan Kalyan Politically. Ram Charan tweeted 'I'm an Indian. I care for my motherland"- Pawan Kalyan. What an energetic start of Chalo re Chalo re chal. Babai, wishing you all the best!! Jai Jana Sena!!'.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more