»   » పవన్ చిరు ఫొటోలు చూసారా??: రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ల విషెస్ ఇలా ఉన్నాయి

పవన్ చిరు ఫొటోలు చూసారా??: రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ల విషెస్ ఇలా ఉన్నాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇవాళ హీరో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బర్త్‌డే. ఫ్యాన్స్‌కి పండుగ రోజు. పవన్ బర్త్‌డే సందర్భంగా ప్రత్యేకంగా ఒక లోగోను కూడా తయారు చేసి సోషల్ మీడియాలో తమ డిస్‌ప్లే పిక్‌గా పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ తన బాబాయికి బర్త్‌డే విషెస్ తెలిపాడు. పవన్ వంటి బాబాయి తనకు ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీలవుతున్నానని పేర్కొన్నాడు.

నిజానికి కొన్నాళ్ళుగా పవన్ మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా కనిపించకపోవటం, రాజకీయంగా కొత్త దారిని ఎంచుకోవటంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. చిరంజీవి, రామ్ చరణ్ లు పలు సందర్భాల్లో అంతా ఒకటే అన్న సంకేతాలు ఇస్తున్నా.. అభిమానుల్లో అనుమానాలు అలాగే ఉన్నాయి. అయితే ఈ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఓ ఆసక్తికరమైన ఫొటోలు బయటకు వచ్చాయి.

తను చాలా లక్కీ పర్సన్ అని అలాంటి బాబాయికి కుమారుడిగా ఉండటం అదృష్టమని తెలిపాడు. నిజాయితీ.. సింపుల్‌గా ఉండటం, హార్ట్‌ఫుల్‌గా మాట్లాడటం అన్నీ పవన్ నుంచే నేర్చుకున్నానని స్పష్టం చేశాడు. మిలియన్ల మందికి పవన్ అండగా ఉంటాడని తన నమ్మకమంటూ పేర్కొన్నాడు. మానవత్వానికి.. సింప్లిసిటీకీ నువ్వో నిదర్శనం.. హ్యాపీ బర్త్‌‌డే పవన్ కల్యాణ్ అంటూ విష్ చేశాడు. పవన్‌తో తనకున్న అనుబంధాన్ని తెలిపేలా కొన్ని ఫోటోస్‌ని చెర్రీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

చిరు పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆసందర్భంలో వారిద్దరూ ఆత్మీయంగా దిగిన ఫొటోను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్ 'బాబాయే అబ్బాయి అయితే?... కాదు బాబాయి కూడా అబ్బాయే....!' అంటూ కామెంట్ చేశాడు. చిరు.. పవన్ ను కూడా చరణ్ లాగే భావిస్తాడన్న ఉద్దేశంతో సాయి ధరమ్ చేసిన ట్వీట్ మెగా అభిమానులను ఫిదా చేసింది.

English summary
Ram charan and sai dhatram tej posted intrested photos of pawan kalyan, Wishing Pawan on his Birth day
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu