సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయబోతున్న రామ్ చరణ్!
రామ్ చరణ్‌తో పాటు ఆయన అభిమానులు కూడా 'జంజీర్' చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌కు సల్మాన్ ఖాన్ సంస్థలో చేసే అవకాశం రావడం ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. దీంతో పాటు మరో రెండు బాలీవుడ్ చిత్రాల్లో కూడా ఆయన కమిటైనట్లు తెలుస్తోంది.
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సపోర్టుతో వచ్చిన వారంతా పెద్ద స్టార్లుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో సల్లూభాయ్‌తో మంచి ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్న రామ్ చరణ్‌కు అతని చేయూత బాగా ప్లస్సవుతుందని, అన్నీ కలిసొస్తే రామ్ చరణ్ భవిష్యత్‌లో బాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రామ్ చరణ్ తెలుగు సినిమా విషయానికొస్తే.....వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన 'ఎవడు' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో రామ్ చరణ్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వెంకటేష్ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












