twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంచరణ్, సుకుమార్‌లకు పెద్ద షాక్: అంతా అయిపోయిందనుకున్న దశలో ఇలా జరిగిందా?..

    |

    Recommended Video

    రాంచరణ్, సుకుమార్‌లకు పెద్ద షాక్..

    అద్భుతాలు అరుదుగా మాత్రమే జరుగుతుంటాయనే ఓ ప్రచారం ఉంది. వెండితెర విషయంలోనూ ఈ మాటను కొట్టిపారేయలేం. ఏడాదికి ఎన్ని సినిమాలు దండయాత్ర చేసినా.. నిలిచిపోయే చిత్రాలు మాత్రం ఒకటీ అరా అంతే.

    ప్రస్తుతం రాంచరణ్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం 1985 పై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి. అంతేస్థాయిలో సినిమాపై నెగటివ్ పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా కథ విషయంపై కొన్ని ఊహాగానాలు రాగా.. ఇప్పుడు ఏకంగా ఫుటేజ్ ఎగిరిపోయిందన్న ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

    ఊర మాస్ రంగస్థలానికి, మెగాస్టార్ సినిమాకు లింకేంటి?: చిరంజీవి నిజంగా అలా అన్నారా?ఊర మాస్ రంగస్థలానికి, మెగాస్టార్ సినిమాకు లింకేంటి?: చిరంజీవి నిజంగా అలా అన్నారా?

    అసలేమైంది?:

    అసలేమైంది?:

    'రంగస్థలం' షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. దర్శకుడు సుకుమార్.. సాంగ్స్ మినహా సినిమాలోని కీలక సన్నివేశాలన్ని ఇప్పటికే షూట్ చేసేశాడు. ఇటీవల మొత్తం షూటింగ్ కు సంబంధించిన రషెస్ చెక్ చేశారట. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల హార్డ్ డిస్క్ లో ఉన్న ఫుటేజీ ఎగిరిపోయిందట. దీంతో చిత్ర యూనిట్ తీవ్ర షాక్ కు లోనైనట్లు తెలుస్తోంది.

    రీషూట్..:

    రీషూట్..:

    హార్డ్ డిస్క్ లో ఫుటేజీ ఎగిరిపోవడంతో రంగస్థలం యూనిట్ రీషూట్ కు కూడా సిద్దమైపోయిందనే వార్త వినిపిస్తోంది. నిజంగానే రీషూటింగ్ గనుక మొదలుపెట్టి ఉంటే.. ఈ చిత్ర విడుదల మరింత ఆలస్యమవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముందుగా అనుకున్నట్లు మార్చి, 2018లో కాకుండా.. మరింత వాయిదా పడే అవకాశం ఉంది.

    ఏ సీన్స్..:

    ఏ సీన్స్..:

    రంగస్థలం సినిమాలో రాంచరణ్-సమంతల మీద షూట్ చేసిన కొన్ని సీన్స్ హార్డ్ డిస్క్ నుంచి ఎగిరిపోయాయట. దీంతో హీరో రాంచరణ్, దర్శకుడు సుకుమార తల పట్టుకున్నట్లు తెలుస్తోంది.

    పెద్ద రిస్కే..

    పెద్ద రిస్కే..

    ఈ సినిమా కోసం అప్పటి గ్రామీణ నేపథ్యాన్ని తలపించేలా సెట్స్ వేసి షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం భారీగానే ఖర్చు పెట్టారు. ఒకవేళ ఈ సీన్సే గనుక ఫుటేజీ నుంచి ఎగిరిపోయి ఉంటే.. రీషూట్ చేయడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. దర్శకుడు సుకుమార్ ఈ కష్టాల్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.

    మరిన్ని కాల్షీట్స్ ఇవ్వాల్సిందే..:

    మరిన్ని కాల్షీట్స్ ఇవ్వాల్సిందే..:

    ఓవైపు చిరంజీవి సైరా సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే.. మరోవైపు రంగస్థలం షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు రాంచరణ్. ఇప్పుడీ సినిమా ఫుటేజీ ఎగిరిపోవడంతో మరిన్ని రోజులు రంగస్థలం యూనిట్‌కు మరిన్ని కాల్షీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వర్క్ రీత్యా.. రాంచరణ్‌పై కూడా మరింత భారం పడ్డట్లే అంటున్నారు.

    English summary
    According to the latest buzz in the film industry, the hard disk in which the shoot was recorded got encrypted and entire data got erased.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X