డిప్రెషన్ లో ఉన్న రామ్ చరణ్ కు రచ్చ కాస్త ఊరట..!
'ఏమైంది ఈ వేళ' చిత్రంతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు సంపత్ నందికి ఇప్పుడు ఓ అద్భుతమైన అవకాశం దొరికింది. అదే రామ్ చరణ్ ను డైరెక్ట్ చేయడం. గతంలో జూ ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి ల కలయికలో వస్తున్న చిత్రానికి రచ్చ టైటిల్ ను నిర్ణయించినట్లుగా వచ్చిన వార్తలను ఖండిస్తూ సంపత్ నంది ఆ టైటిల్ తనదంటూ మీడియాకు ఎక్కిన సంగతి తెలిసిందే.
అయితే ఇదే టైటిల్ తో రవితేజ తో సినిమా చేయాలనుకున్న సంపత్ నంది రవితేజను ఒప్పించడం కూడా జరిగింది. కానీ ఎప్పుడు ఇదే కథను చరణ్ కు కూడా చెప్పి అవకాశాన్ని సంపాదించాడు. మెరుపు చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో సంపత్ రవితేజకు హ్యాండిచ్చి చరణ్ తో రచ్చ చేయడానికి సిద్దమయ్యాడు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభించబోతున్నట్టు నిర్మాతలు చెప్తున్నారు. ధరణి చెప్పిన కథ కంటే సంపత్ చెప్పిన లైనే నిర్మాతలకి, హీరోకి బాగా నచ్చిందట. మాటలు, ట్రీట్ మెంట్ కూడా నచ్చడంతో వెంటనే సినిమా స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారు.తన ఫ్యూచర్ విషయంలో టెన్షన్ లో వున్న రామ్ చరణ్ కి ఈ సినిమా స్టార్ట్ అవుతుండడం కాస్త ఊరట కలిగించే విషయమే.


Click it and Unblock the Notifications











