రామ్ చరణ్‌కు తొలి పండగ కలిసొచ్చేనా?
హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి పండక్కి ఎంత ప్రత్యేకత ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఒక రకంగా సంక్రాంతి పండగ తెలుగు సినీ పరిశ్రమకు కాసులు కురిపించే పండగ. పెద్ద పెద్ద హీరోలంతా సంక్రాంతి తమ సినిమా తప్పకుండా విడుదలవ్వాలని కోరుకుంటూ ఉంటారు.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలిసారిగా సంక్రాంతి బరిలో నిలవబోతున్నాడు. 2007లో చిరుత సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పటి వరకు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే అందులో ఏ ఒక్క సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాలేదు. తాజాగా ఆయన వివి వినాయక్ దర్శకత్వంలో చేస్తున్న 'నాయక్' చిత్రం సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 9న విడుదలకు సిద్దం అవుతోంది. మరి సంక్రాంతి సెంటిమెంటు చెర్రీకి కలిసొస్తుందో లేదో చూడాలి.

వి.వి.వినాయక్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య 'నాయక్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, అమలాపాల్ కథానాయికలు. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన చిత్ర ఆడియో డిసెంబర్ రెండోవారంలో విడుదలకానుంది.
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ఇందులో రామ్‌చరణ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారు. వినాయక్ తనదైన శైలిలో చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. చక్కటి కథాబలంతో రామ్‌చరణ్ అభిమానులు ఆశించే అంశాలన్నీ ఈ చిత్రంలో వున్నాయి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోక్షిగఫీ: ఛోటా కె నాయుడు, కథ-మాటలు: ఆకుల శివ, సంగీతం: థమన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, ఫైట్స్: కనల్‌కణ్ణన్, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వి.వి.వినాయక్.


Click it and Unblock the Notifications











