సమయస్పూర్తితో ప్రాణాలు కాపాడిన రామ్ చరణ్

By Bojja Kumar

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి అందరితో శబాష్ అనిపించుకున్నాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక వ్యక్తి ప్రాణాలు కాపావడంతో రామ్ చరణ్‌ను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 'జంజీర్' షూటింగ్ లో భాగంగా కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఓ స్టంట్ మేన్ ను చరణ్ ప్రాణాపాయం నుంచి తప్పించాడట. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జంజీర్ సినిమా షూటింగ్ ధారావి స్లమ్ ఏరియా సెట్లో... హీరోను కొందరు గూండాలు చేజ్ చేసే సన్నివేశం షూట్ చేస్తుండగా.. చరణ్ కారు నుంచి ఓ స్టంట్ మేన్ పట్టుతప్పి జారిపోయాడు. ఆ ప్రాంతంలో దుమ్ము పెద్ద ఎత్తున రేగడంతో యూనిట్ సిబ్బందికి కారు వద్ద ఏం జరిగిందో కనిపించలేదు. అయితే, ఫైటర్ మిస్సవడాన్ని గమనించిన రామ్ చరణ్ సెకన్ల లిప్తపాటులో కారుకు బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. కారును అలానే ముందుకు ఉరికించి ఉంటే ఆ స్టంట్ మేన్ కు తీవ్ర ప్రమాదం వాటిల్లేదని, కానీ, చరణ్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, అతడి ప్రాణాలు కాపాడాడని యూనిట్ సిబ్బంది కొనియాడారు.

సినిమా వివరాల్లోకి వెళితే...రామ్ చరణ్ తేజ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రాన్ని తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రామ్ చరణ్‌తో జతకడుతోంది. రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు, ప్రియాంకతో చేసే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు. సెప్టెంబర్ 6న సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X