నాన్నను అలా చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. సంచలన విషయాలు బయటపెట్టిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పిన కొన్ని విషయాలు ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరిచాయి. ఇటీవలే నాన్న చిరంజీవితో చారిత్రాక సినిమా 'సైరా నరసింహా రెడ్డి' రూపొందించిన రామ్ చరణ్.. తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాలేంటో చూద్దామా..

తండ్రికి కొడుకు కానుక
తన స్వీయ నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ హంగులు జోడించి 'సైరా నరసింహా రెడ్డి' సినిమా రూపొందించారు రామ్ చరణ్. తండ్రికి తానిస్తున్న కానుక ఈ సినిమా అని పలు సమావేశాల్లో చెప్పిన ఆయన.. తాజాగా ఈ సినిమా సెట్స్ పై ఉన్న సమయంలో జరిగిన సంఘటనలు, సైరాకు సంబంధించిన వివరాలు అందరితో పంచుకున్నారు.

సైరా కలెక్షన్స్ గురించి చెర్రీ..
భారీ బడ్జెట్ కేటాయించి 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కించారు రామ్ చరణ్. అయితే కలెక్షన్స్ పరంగా ఆశించిన మేర రిసల్ట్ రాబట్టలేక పోయింది సైరా. తాజాగా ఈ విషయమై రామ్ చరణ్ స్పందించాడు. కలెక్షన్స్ విషయం తాను తెలుసుకోలేదని చెప్పాడు. ‘సైరా నరసింహారెడ్డి' సినిమా తెలుగులో రంగస్థలం కలెక్షన్స్‌ను దాటి.. ‘బాహుబలి' కి దగ్గరగా వచ్చిందని మాత్రమే తెలుసుకున్నానని అన్నారు.

కన్నీళ్లు ఆపుకోలేకపోయా..
ఇక ‘సైరా నరసింహారెడ్డి' క్లైమాక్స్ విషయమై మాట్లాడిన చెర్రీ.. క్లైమాక్స్ షూటింగ్ జరిగే సమయంలో తాను లేనని చెప్పారు. కానీ వెండితెరపై ఆ సీన్స్, చిరంజీవి అభినయం చూసి తనకు కన్నీరు ఆగలేదని చెర్రీ చెప్పారు. తల తెగి ఉన్న ఆయనను చూసి కంటతడి పెట్టుకున్నానని ఆయన తెలిపారు.

రెండు నెలలు ఆలోచించాం
క్లైమాక్స్‌లో వచ్చే ఆ సీన్లను ఎలా తీయాలా ? అని రెండు నెలలు ఆలోచించానన్నారు. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరి తీసిన తర్వాత 30 ఏళ్ల పాటు ఆ తలను కోట గుమ్మానికి వేలాడదీశారని దాన్ని అలాగే చూపించాలా ? వద్దా ? అని ఎంతో ఆలోచించామని అన్నారు. చివరకు కొంచెం క్రియేటివిటీ జోడించి ఆ సీన్ షూట్ చేశామని తెలిపారు.

RRR లో రామ్ చరణ్
రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 31 న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











