మొత్తానికి కరోనా నుంచి మోక్షం.. ఊపిరి పీల్చుకుంటోన్న మెగా ఫ్యామిలీ
గత కొన్ని రోజులుగా మెగా ఇంట్లో కరోనా బీభత్సం సృష్టించింది. రామ్ చరణ్ వరుణ్ తేజ్‌లు వరుసగా కరోనా బారిన పడటంతో అందరూ ఆందోళన చెందారు. క్రిస్మస్ వేడుకలే కొంప ముంచాయని అందరూ అనుకున్నారు. కరోనా దెబ్బకు మెగా ఇంట్లో న్యూ ఇయర్ కూడా అంత ఘనంగా జరగలేదు. ఇలా రామ్ చరణ్ వరుణ్ తేజ్‌లు తమకు కరోనా పాజిటివ్ అని ప్రకటించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే మొత్తానికి ఆ ఇద్దరికి కూడా ఇప్పుడు నెగెటివ్ వచ్చేసింది.

క్రిస్మస్ వేడుకలు..
మెగా ఫ్యామిలీలో క్రిస్మస్ వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో అందరికీ తెలిసిందే. ఈ వేడుకలను కూడా రామ్ చరణ్, ఉపాసనలు దగ్గరుండి మరీ నిర్వహించారు. ఈ పార్టీలో మెగా అల్లు వారంతా కలిసి సందడి చేశారు. అయితే ఈ వేడుకల్లోనే కరోనా వ్యాప్తి చెంది ఉంటుందనే ఊహాగానాలు వచ్చాయి.

ఇద్దరూ క్వారంటైన్..
రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరూ కూడా క్వారంటైన్ అయిపోయారు. కరోనా పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రకటించేసి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. రామ్ చరణ్‌కు తోడుగా ఉపాసన కూడా క్వారంటైన్‌లోనే ఉంది. ఇక వరుణ్ తేజ్ ఒంటరిగానే క్వారంటైన్‌ను గడిపేశాడు. అయితే రెండు మూడు రోజుల క్రితం వరుణ్ తేజ్ తనకు నెగెటివ్ వచ్చిందని ప్రకటించాడు.

తాజాగా అలా..
అయితే తాజాగా రామ్ చరణ్ కూడా తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపాడు. అంతే కాకుండా తన ఫాంలో పక్షులతో ఆడుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు. ఇక త్వరలోనే మళ్లీ పనిలోకి వెళ్తాను.. షూటింగ్ మొదలెట్టేస్తానని చెప్పుకొచ్చాడు.

తాజాగా మరోసారి కలకలం..
తాజాగా అనసూయ కూడా తనకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయ్.. వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. ఇలా ప్రకటించే ముందు రోజే అనసూయ నిహారిక కలిసి నటిస్తోన్న వెబ్ సిరీస్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంది. అలా మళ్లీ మెగా ఇంట్లోకి కరోనా వస్తుందేమో అని అందరూ ఆందోళన చెందారు.


Click it and Unblock the Notifications











