రామ్ చరణ్-వెంకీ మల్టీ స్టారర్ మూవీ ఫస్ట్ ఇదే!(ఫోటో)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మించనున్నారు.
ఇటీవల ఈ విషయాన్ని బండ్ల గణేష్ తన ట్విట్టర్ ద్వారా ఖరారు చేసారు. విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో సినిమా నిర్మించే అవకాశం వచ్చింది. వారిద్దరికీ ధన్యవాదములు. వారిద్దరి నుంచి నాకు వచ్చిన దీపావళి కానుకగా ఈ అవకాశాన్ని భావిస్తున్నాను అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ స్లిమ్ లుక్‌లో సరికొత్తగా కనిపించనున్నారు. క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ తనదైన స్టైల్‌లో సినిమాను తెరకెక్కించబోతున్నారు. సినిమాలో రామ్ చరణ్‌కు సంబంధించిన లుక్ ఇదే అంటూ నెట్లో ఓ ఫోటో కూడా హల్ చల్ చేస్తోంది. అ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి మరి!
ఈ చిత్రం ప్రారంభోత్సవం డిసెంబర్లో జరుగనుందని తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, వెంకటేష్ సరసన నయనతార నటించనున్నట్లు సమాచారం. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా దీన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు కృష్ణ వంశీ.


Click it and Unblock the Notifications












