ఆ నిర్మాతకు మామిడి పళ్ళు పంపిన రాంచరణ్, ఉపాసన.. స్పెషల్ డే!
గురువారంతో రాంచరణ్, ఉపాసన వివాహబంధంతో ఒక్కటై ఆరేళ్ళు గడచింది . మ్యారేజ్ యానవర్సరీ సందర్భంగా రాంచరణ్ తో ఉన్న రొమాంటిక్ పిక్స్ ని ఉపాసన షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా రాంచరణ్ దంపతులు తమ పెళ్లిరోజు సందర్భంగా నిర్మాత డివివి దానయ్యకు తియ్యటి బహుమతి అందజేశారు.
రాంచరణ్, ఉపాసన తనకు మామిడిపళ్ళు పంపినట్లు దానయ్య తెలిపారు. ఆ మామిడి పళ్ళ బుట్టని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాంచరణ్, ఉపాసనకు దానయ్య పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

రాంచరణ్ ప్రస్తుతం డివివి దానయ్య నిర్మిస్తున్న బోయపాటి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత కూడా దానయ్య నిర్మాణంలోనే రాంచరణ్ నటించాల్సి ఉంది. రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి చిత్రానికి ఈయనే నిర్మాత.


Click it and Unblock the Notifications











