6 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ చికెన్‌తో టిఫిన్ పెట్టారు.. ఆమె వల్లే ఆ అదృష్టం.. రాంచరణ్ ఎమోషనల్ స్పీచ్

స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ నిర్వహించిన ఈ వేడుకలో వెంకటేష్, రాంచరణ్, నాగచైతన్య తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో రాంచరణ్ మాట్లాడుతూ..

వేదిక మీద ఉన్న చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ గారికి, పెద్దలందరికి నమస్కారం. నందమూరి అభిమానులకు, పేరు పేరునా ధన్యవాదాలు. ఎక్కడ మొదలు పెట్టాలో అర్ధం కావడం లేదు. సినీ దిగ్గజం గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. వారి వేసిన దారులు, వారు సాధించిన విజయాలను గురించి గుర్తు తెచ్చుకోవాలి తప్ప.. ఎక్కువగా వారి గురించి మాట్లాడకూడదనేది నా అభిప్రాయం. తెలుగు వారికి గుర్తింపునిచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అలాంటి వ్యక్తి పనిచేసిన రంగంలో నేను పనిచేస్తున్నానే విషయం గర్వంగా ఉంది అని రాంచరణ్ అన్నారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావును ఎక్కువ సార్లు కలువలేదు. నా జీవితంలో ఒకేసారి కలిశాను. నేను పురేందేశ్వరి గారి అబ్బాయి కలిసి స్కేటింగ్ చేసే వాళ్లం. బంజారాహిల్స్ రోడ్ 12 లో స్కేటింగ్ చేయడం ముగిసిన తర్వాత మా తాత వాళ్ల ఇంటికి వెళ్దామా అని అడిగాడు. అప్పుడు నేను 6వ తరగతి చదువుతుంటాను అనుకొంటా. ఆ సమయంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. సీఎం ఇంటిలో సెక్యూరిటీ ఉంటుందా? అనే విషయం కూడా తెలియదు అని రాంచరణ్ చెప్పారు.

ఆ రోజు ఉదయం 6.30 గంటల సమయంలో ఆయనను కలిశాను. మీరు విన్నట్టే.. ఆయన ఉదయమే చికెన్‌తో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. మేము మొదటిసారి కలిసినప్పుడు ఆ వయసులో చికెన్ తింటూ.. నాకు కూడా టిఫిన్ పెట్టారు. అలాంటి అవకాశం కలిగించిన పురేందేశ్వరి గారికి ధన్యవాదాలు. సినిమా పరిశ్రమ బతికి ఉన్నంత కాలం ఆయన పేరు చిరకాలం ఉంటుంది అని రాంచరణ్ చెప్పారు.

 Ram Charan

తెలుగు, దక్షిణాది సినిమా గురించి ప్రస్తుతం మాట్లాడుతున్నారంటే.. ఆ విషయాన్ని ఎన్టీఆర్ ఎప్పుడో చాటి చెప్పారు. ఇలాంటి ఫంక్షన్లు సినిమా పరిశ్రమకు చాలా అవసరం. ఈ ఫంక్షన్‌ను నిర్వహించిన చంద్రబాబుకు ధన్యవాదాలు. మా ఫంక్షన్లకు బాలకృష్ణ గారు వస్తారు. ఈ ఫంక్షన్‌కు మరిచిపోకుండా పిలిచినందుకు ధన్యవాదాలు. జై ఎన్టీఆర్ అంటూ రాంచరణ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X