బాబాయే నాకు ఆదర్శం.. ఇకపై నేను కూడా.. రామ్ చరణ్ ఓపెన్ స్టేట్‌మెంట్

బాబాయ్ పవన్ కళ్యాణ్‌ని చూసి ఇన్స్పైర్ అయ్యానని అంటున్నారు అబ్బాయ్ రామ్ చరణ్. మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్‌ మేజర్ అట్రాక్షన్ అనే సంగతి తెలిసిందే. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన మార్క్ వేస్తున్న ఆయనంటే మెగా కుటుంబంలోని అందరికీ మహా ఇష్టం. ముఖ్యంగా చిరు తనయుడు రామ్ చరణ్, బాబాయ్‌ని బాగా ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే పవన్ బాటలో వెళ్లేందుకు సిద్దమయ్యారట చెర్రీ. ఈ విషయాన్ని ఆయనే ఓపెన్‌గా చెప్పేశారు. ఆ వివరాలేంటో చూద్దామా..

పవన్ దారిలో చెర్రీ.. ఇన్స్‌స్టాగ్రామ్ పోస్ట్

పవన్ దారిలో చెర్రీ.. ఇన్స్‌స్టాగ్రామ్ పోస్ట్

బాబాయ్ పవన్ కళ్యాణ్ తనకు ఆదర్శప్రాయమైన వ్యక్తి అని ఎప్పుడూ చెబుతుండే రామ్ చరణ్.. ఏకంగా పవన్ దారిలో వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించి మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపారు. త్వరలోనే తాను పవన్ దారిని ఎంచుకుంటానని చెబుతూ ఇన్స్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు రామ్ చరణ్.

 రాజకీయాలతో పాటు అవి కూడా..

రాజకీయాలతో పాటు అవి కూడా..

సినిమాల్లోంచి రాజకీయాల్లోకి దూకిన పవన్ కళ్యాణ్.. అప్పుడప్పుడూ తన ఫామ్ హౌజ్ విజిట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇటీవలే ఫామ్ హౌజ్ వెళ్లిన ఆయన.. అక్కడ గోమాతలతో ఆడుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గొడుగు పట్టుకుని గోశాలలో నడుస్తూ, గోమాతలకు అరటిపళ్లు తినిపిస్తూ కనిపించారు పవన్.

బాగా ఇన్స్పైర్ అయ్యా.. ఓపెన్ స్టేట్‌మెంట్

బాగా ఇన్స్పైర్ అయ్యా.. ఓపెన్ స్టేట్‌మెంట్

కాగా ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రామ్ రామ్ చరణ్.. తాను కూడా పవన్ బాటలో నడవబోతున్నానని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ ఫొటోలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాయని ఈ సందర్బంగా చెర్రీ పేర్కొన్నారు. త్వరలోనే తాను కూడా గోశాలను ప్రారంభించబోతున్నానని చెప్పారు. హ్యాపీ కార్తికమాసం అంటూ అందరికీ విషెస్ తెలిపారు రామ్ చరణ్.

ఎక్కడ? ఏంటి? ఆ వివరాలు

అంటే త్వరలోనే రామ్ చరణ్ గోశాల నిర్మాణంపై దృష్టి పెట్టనున్నారని కన్ఫర్మ్ అయింది. అయితే ఈ నిర్మాణం ఎక్కడ? ఏంటి? ఆ వివరాలు మాత్రం చెప్పాడు చెర్రీ. మరోవైపు రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

రామ్ చరణ్ సినిమా ప్రపంచం

రామ్ చరణ్ సినిమా ప్రపంచం

సినిమానే తన ప్రపంచంగా భావిస్తున్న రామ్ చరణ్.. ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించారు. అలాగే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా జులై 30వ తేదీన విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X