26 వరకూ కొబ్బరి చెట్ట క్రిందే రామ్ చరణ్

By Srikanya

Ram Charan shooting at Pollachi
హైదరాబాద్: రామ్‌చరణ్, కాజల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మాత. శివబాబు బండ్ల సమర్పిస్తున్న ఈ చిత్రం పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. ఎటుచూసినా పచ్చదనం.. గలగలపారే సెలయేర్లు.. చక్కటి పైరు గాలులు.. అంతెత్తు కొబ్బరిచెట్లు... ప్రస్తుతం రామ్‌చరణ్‌ సినిమా చిత్రీకరణ ఇలాంటి ప్రాంతంలోనే జరుగుతోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. రామ్‌ చరణ్‌, కాజల్‌పై పాటని చిత్రీకరించారు. ఇంకా చిత్ర ప్రధానతారాగణంపై కీలక సన్నివేశాల్ని కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 26వరకు అక్కడే చిత్రీకరణ ఉంటుంది. శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ...''కుటుంబ సంబంధాలు, ప్రేమాభిమానాలు నిండిన చిత్రమిది. కృష్ణవంశీ తరహా స్క్రీన్‌ప్లేలో చరణ్‌ శైలికి తగ్గట్టుగా ఈ చిత్రం రూపొందుతోంది. హీరో,హీరోయిన్స్ జంట ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందిస్తుంది. చరణ్‌కి యంగ్‌ బాబాయిగా శ్రీకాంత్‌ అలరిస్తారు .ఫిబ్రవరి 6న మా సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని రంభించాం. ఇటీవల కన్యాకుమారిలోని చక్కటి లొకేసన్లలో చిత్రీకరించాం. రామ్‌చరణ్, శ్రీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కించిన సన్నివేశాలు బాగా వచ్చాయి. సినిమా అందరి అంచనాలను అందుకునేలా ఉంటుంది. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ జంటగా నటిస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్నారు'' అని అన్నారు.

అలాగే... ''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్‌చరణ్‌ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్‌ ఇందులో రామ్‌చరణ్‌కి యంగ్‌ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగర్‌కోయిల్‌, పొల్లాచ్చిలోనూ చిత్రీకరణ జరుపుతాము''అన్నారు.

ఈ చిత్రంలో చరణ్‌ విదేశాల్లో చదువుకొనే ఓ యువకుడిగా నటిస్తాడని తెలుస్తోంది. మే నుంచి విదేశాల్లో చిత్రీకరణ జరుపుతారని సమాచారం. ''కుటుంబ అనుబంధాలతో పాటు, చరణ్‌ శైలికి తగ్గ మాస్‌ అంశాలు కూడా చిత్రంలో ఉంటాయి''అని నిర్మాత చెబుతున్నారు. నలభై రోజులపాటు ఈ షెడ్యూల్‌ సాగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కృష్ణవంశీ మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు తండ్రిగా నాగార్జునని అడుగుతున్నారని తెలుస్తోంది. తాతగా రాజ్ కిరణ్ కనిపించనున్నాడు.

ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X