రామ్‌చరణ్,కృష్ణ వంశీ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో
హైదరాబాద్: రామ్‌చరణ్ హీరోగా ఓ కుటుంబ కథా చిత్రం తెరకెక్కుతోంది. కాజల్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు. బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కన్యాకుమారిలో షూటింగ్ జరుగుతోంది. కుటుంబ నేపథ్యంలో వచ్చే కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చరణ్‌తోపాటు ప్రధాన తారాగణమంతా చిత్రీకరణలో పాల్గొంటోంది.
ఈ చిత్రంలో చరణ్ విదేశాల్లో చదువుకొనే ఓ యువకుడిగా నటిస్తాడని తెలుస్తోంది. మే నుంచి విదేశాల్లో చిత్రీకరణ జరుపుతారని సమాచారం. ''కుటుంబ అనుబంధాలతో పాటు, చరణ్ శైలికి తగ్గ మాస్ అంశాలు కూడా చిత్రంలో ఉంటాయి''అని నిర్మాత చెబుతున్నారు. నలభై రోజులపాటు ఈ షెడ్యూల్ సాగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- ''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్‌చరణ్ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్ ఇందులో రామ్‌చరణ్‌కి యంగ్ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్‌కిరణ్ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగర్‌కోయిల్, పొల్లాచ్చిలోనూ చిత్రీకరణ జరుపుతాము''అన్నారు.
కృష్ణవంశీ మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు తండ్రిగా నాగార్జునని అడుగుతున్నారని తెలుస్తోంది. తాతగా రాజ్ కిరణ్ కనిపించనున్నాడు.
ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.


Click it and Unblock the Notifications











