రామ్ చరణ్ 4వేల అడుగుల ఎత్తు నుంచి...కంగారుపడ్డాం
నేను 250 అడుగుల పైనుంచి బంగీ జంప్ చేస్తే, ఇందులో రామ్ చరణ్ 4వేల అడుగుల ఎత్తు నుంచి స్కై-డైవ్ చేశాడు. ఇంట్లో అంతా కంగారుపడ్డాం. అభిమానులు ఆశీస్సులు ఉన్నంతవరకూ వాడికేం కాదని నేనే సర్దిచెప్పా అంటూ ఆరెంజ్ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయన ఆరెంజ్ చిత్రం గురించి మాట్లాడుతూ..'మగధీర' తరవాత ఎలాంటి సినిమా చెయ్యాలని చాలా ఆలోచించాం. అన్ని సినిమాలూ 'మగధీర' అవ్వవు. అభిమానుల్లో అంచనాలను దించాలి. అదే సమయంలో వారిని మెప్పించాలి. అందుకోసమే ఈ చిత్రం ఎంచుకొన్నాడు అన్నారు.
ఇక ఫాన్స్ ఏం కోరుకొంటున్నారన్నదే ముఖ్యం. యువతరం మెచ్చే సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. కథ చెప్పగానే దీనికి సరైన సంగీతం, ఫైట్లు జోడిస్తే తప్పకుండా మంచి సినిమా అవుతుందని చెప్పా. హారిస్ జైరాజ్ చక్కటి బాణీలిచ్చాడు. ఆరు పాటలూ చాలా బాగున్నాయి. ఫైట్స్ విషయంలోనూ ఏ మాత్రం రాజీపడకుండా పనిచేశారు అన్నారు.
దర్శకుడు భాస్కర్ మాట్లాడుతూ 'చిరుత', 'మగధీర' తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నానంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రెండేళ్లు కష్టపడి ఎంతో జాగ్రత్తగా ఈ కథను తయారు చేసుకొన్నా. కలర్ దృష్టిలో పెట్టుకొని ఈ పేరు పెట్టా. ఆరెంజ్ ఓ రేంజ్ అనేలా ఉంటుంది ఈ చిత్రం. కథలో ఓ నిజముంది. నిజానికి శక్తి ఉంటే అందరి జీవితాలు ఎలా తిరగబడిపోతాయో ఈ చిత్రం చెబుతుంది. మొత్తానికి ఆరెంజ్ మేలిమి బంగారం అన్నారు.


Click it and Unblock the Notifications











