చరణ్ బాధ్యతను తన భుజాలపై వేసుకొన్న పవన్ సో హ్యాపీ...!
పంజా ఆడియో విడుదల వేడుకలో పవన్ తప్ప, మెగా ఫ్యామిలీకి సంబంధించిన మరో సెలబ్రిటీ కనిపించలేదు. ఈ విషయమై నానా రకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. మెగా ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయనీ. మొత్తంగా మెగా ఫ్యామిలీ పవన్ ని దూరం పెట్టిందనీ మీడియాలో దుమారం రేగింది. అదంతా ఉత్తదేనంటూ చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, చరణ్..ఇలా అందరూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇక చరణ్ ఎంగేజ్ మెంట్ కి స్వయంగా చరణ్ కి పవన్ కళ్యాణ్ తన కారులో..అదీ కొత్తగా కొనుకున్న మెర్సిడెస్ బెంజ్ కారులో ఎంగేజ్ మెంట్ వేదికకు తీసుకెళ్ళడం మెగాభిమానుల్ని సంబరాల్లో ముంచెత్తింది. ఈ వేడుక కోసమే ఆఘమేఘాల మీద పవన్ దాన్ని కొనుగోలు చేసారని సమాచారం. అవును మరి అబ్బాయి రామ్ చరణ్ మీద బాబాయ్ పవన్ కి ఉన్న ప్రేమ అటువంటిది మరి. చరణ్ ని ఎంగేజ్ మెంట్ వేదికకు తీసుకెళ్ళే బాధ్యత తన భుజాల మీద పెట్టడం చాలా ఆనందంగా వుందని పవన్ అన్నాడు. బాబాయ్ తో సరదా సరదాగా మాట్లాడుతూ, ఈ రోజు తన జీవితంలో మర్చిపోలేని రోజని అంటున్నాడు చరణ్.


Click it and Unblock the Notifications











