'రచ్చ'సెన్సార్ రిపోర్టు పై రామ్‌చరణ్
రామ్‌చరణ్, తమన్నా జంటగా నటిస్తోన్న 'రచ్చ' చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ జరిగింది. ఈ సెన్సార్ రిపోర్టు గురించి రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ...."సెన్సార్ ఇప్పుడే జరిగింది...చాలా పాజిటివ్ రిపోర్టు. ఏప్రియల్ ఐదన రిలీజ్ చేయటానికి ఖరారు అయ్యింది. నా టీమ్ కు ఆల్ ది బెస్ట్" అని ట్వీట్ చేసారు. అభిమానులు ఈ ట్వీట్ చూసి చాలా ఆనందిస్తున్నారు. ఆరెంజ్ తర్వాత చాలా గ్యాప్ తో వస్తున్న ఈ చిత్రం గత రికార్డులని బ్రద్దలు కొడుతుందని భావిస్తున్నారు.
అలాగే నేను చేస్తున్న ఈ రచ్చ చిత్రం డిఫరెంటుతో కూడిన వాణిజ్యవిలువలున్న సినిమా. డాన్స్ చేస్తుండగా గాయాలయ్యాయి. అయినా సినిమా అనుకున్నట్లు రావాలని... పెయిన్ కిల్లర్స్ వేసుకుని నటించానని రామ్ చరణ్ తేజ అన్నారు.
అలాగే ఇఫ్పటికే మణిశర్మ అందించిన పాటలు మంచి హిట్ అయ్యాయని,ఎక్సపెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని,వాటని గ్యారెంటీగా రీచ్ అవుతామని చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్,షూటింగ్ ఫినిష్ అయ్యి,డిటిఎస్ మిక్సింగ్ లో ఉన్నామని చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తవుతుందని చెప్పారు. ఈ చిత్రం మాస్ కి పండగ లాంటిదని చెప్పుకొచ్చారు.
ఇక మెగాసూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఆర్.బి. చౌదరి సమర్పకులు. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు.ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ...ఇప్పటికే ఆడియోకు మంచి స్పందన లభించింది. సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నామన్నారు. సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగిన విధంగా ఉంటుందని, మెగా అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు. వాన వాన రీమిక్స్ పాట సినిమాకు పత్ర్యేక ఆకర్షణ తెస్తుందని చెప్పుకొచ్చారు.
సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ మెడికోగా కనిపించనున్నారు.
ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, ఛాయాగ్రహణం:సమీర్‌రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి


Click it and Unblock the Notifications











