Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అకిరా నందన్ తరువాతే బన్నీ!.. రామ్ చరణ్ పోస్ట్ అర్థం ఇదేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మెగా ఫ్యామిలీతో అకీరా నందన్ కలిసి కనిపిస్తే, వారి ఫ్యామిలీ ఫోటోల్లో అకీరా కనిపిస్తే అతనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. బయట అకీరా కనిపిస్తే కెమెరా కళ్లన్నీ అతడి వైపే తిరుగుతుంటాయి. అయితే నేడు అకీరా నందన్ బర్త్ డే. ఈ క్రమంలో రామ్ చరణ్ అకీరాకు స్పెషల్ విషెస్ అందించాడు.
అకీరా బర్త్ డే..
మామూలుగా అయితే టాలీవుడ్లో కొందరు హీరోలవి ఒకే రోజు పుట్టినరోజులు వస్తుంటాయి. అలా అల్లు అర్జున్, అఖిల్, అకీరా నందన్ బర్త్ డేలు ఒకే రోజు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బన్నీ కంటే ఎక్కువగా అకీరా నందన్ బర్త్ డే గురించి ట్రెండ్ అవుతుంది. ప్రతీ ఏడాది అకీరా నందన్ ఈ విషయంలో బన్నీని బీట్ చేస్తుంటాడు.
నేడు కూడా..
నేడు (ఏప్రిల్ 8) కూడా అకీరా నందన్ బర్త్ డే ట్విట్టర్లో ట్రెండ్ అయింది. కానీ అల్లు అర్జున్ బర్త్ డే మాత్రం ఎక్కడా కనిపించలేదు. అంతా కూడా పుష్ప ఫీవర్లోనే ఉన్నారు. పుష్ప పేరుతో నేడు ట్విట్టర్లో రచ్చ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అకీరా బర్త్ డేను అందరికీ తెలిసేలా చేస్తున్నారు.
వరుణ్ తేజ్ అలా..
వరుణ్ తేజ్ తన తమ్ముడిపై ఎమోషనల్ పోస్ట్ చేశాడు.అకీరా నందన్‌కు విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. నా చిట్టి సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ గతంలో దిగిన ఫోటోను వరుణ్ తేజ్ షేర్ చేశాడు.
రామ్ చరణ్ ఇలా..
ఇక రామ్ చరణ్ సైతం అకీరా నందన్‌కు విషెస్ అందజేశాడు. హ్యాపీ బర్త్ డే డియర్ అకిరా అంటూ లవ్ సింబల్‌ను షేర్ చేశాడు. దాంతో పాటు అదిరిపోయే ఫోటోను షేర్ చేశాడు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అసలే నేడు టాలీవుడ్లో ముగ్గురి బర్త్ డేలు. ఆ ముగ్గురు కూడా రామ్ చరణ్‌కు ఎంతో కావాల్సిన వాళ్లు.
బన్నీ కంటే అకీరానే ముందు..
అల్లు అర్జున్, అఖిల్, అకీరా నందన్ ఈ ముగ్గురూ కూడా రామ్ చరణ్‌కు క్లోజ్. అఖిల్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. బన్నీ, అకీరా బ్లడ్ రిలేషన్. అయితే ఇందులో రామ్ చరణ్ మాత్రం మొదటగా అకీరాకే విషెస్ తెలుపుతూ పోస్ట్ చేశాడు. ఆ తరువాత అఖిల్..చివరగా బన్నీకి విషెస్ తెలిపాడు. అంటే రామ్ చరణ్ దృష్టిలో అకీరాకే మొదటి స్థానమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.