»   » పవన్ ఫ్యాన్స్ గొడవ... అమ్మ సెంటిమెంటుతో చెర్రీ భలే కంట్రోల్ చేశాడే!

పవన్ ఫ్యాన్స్ గొడవ... అమ్మ సెంటిమెంటుతో చెర్రీ భలే కంట్రోల్ చేశాడే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అభిమానం ఉండాలి, కానీ అది వెర్రిగా మారకూడదు. ఒక నటుడిని ఇష్టపడటం, అభిమానించడంలో తప్పు లేదు. కానీ అదే అభిమానం ఇతరులకు ఇబ్బంది కలిగించే పరిస్థితికి దారి తీస్తే దాన్ని వెర్రి అభిమానం కాకుంటే మరేమంటారు.

అభిమానాన్ని హుందాగా ప్రదర్శిస్తే... మీరు అభిమానించే హీరోలు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు. తమ పేరు నిలబెడుతున్నారని సంతోష పడతారు. కానీ మీ ప్రవర్తన కారణంగా మీ హీరోనే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడితే? ఒక్క సారి ఆలోచించండి. ఇదంతా పవన్ కళ్యాణ్ అభిమానుల గురించే అని ఇప్పటికే అర్థమయి ఉంటుంది. అయితే అందరూ అలాంటి వారు కాదు, వారిలో ఉండే అతికొద్దిమంది వల్లే వచ్చింది అసలు ఇబ్బంది.


పవన్ ఫ్యాన్స్ గొడవ

పవన్ ఫ్యాన్స్ గొడవ

మెగా హీరోల ఫంక్షన్లు, వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యే సినీ వేడుకల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు కావాలని గొడవ చేయడం, అరుపులు, కేకలతో ఇబ్బంది కలిగించడం లాంటివి గతంలో చాలా చూశాం. వారి ప్రవర్తన వల్ల ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి. ఆ మధ్య బన్నీ, నాగబాబు వీరికి క్లాస్ పీకారు కూడా. తాజాగా రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు ఆడియో ఫంక్షన్లో కూడా మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవ చేశారు.


దర్శకుడు ఆడియో వేడుకలో

దర్శకుడు ఆడియో వేడుకలో

సుకుమార్ నిర్మించిన ‘దర్శకుడు' ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ మాట్లాడుతుండగా పవన్ కళ్యాన్ అభిమానులు గొడవ చేశారు. దీంతో రామ్ చరణ్ తాను మాట్లాడాల్సింది ఆపి మరీ వారిని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


చెర్రీ భలే కంట్రోల్ చేశాడే

చెర్రీ భలే కంట్రోల్ చేశాడే

మనకు నచ్చిన వ్యక్తుల గురించి మనం రోజూ మాట్లాడుకోం, మన అమ్మ గురించి మనం రోజూ మాట్లాడుకోం, ఆవిడ పక్కన ఉంటే చాలు. మనసులో ఉండాలి. మాటల్లో కాదు. నా ఫ్యామిలీ అనేది నా మనసులో ఎక్కువగా ఉంటుంది, మాటల్లో తక్కువ ఉంటుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి అంటూ..... పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండానే గొడవ చేస్తున్న అభిమానులను కంట్రోల్ చేశాడు చెర్రీ.


తీరు మారలేదు

చెర్రీ అంత చెప్పినా కొందరు అభిమానులు తీరు మారకుండా గొడవ చేస్తూనే ఉన్నారు. తమ అరుపులు, కేకలతో అడ్డు పడే ప్రయత్నం చేశారు. అలా కొందరు పవన్ కళ్యాణ్ అభిమానుల మూలంగా మొత్తం ఫంక్షన్ డిస్ట్రబ్ అయ్యే పరిస్థితి నెలకొంది.English summary
Ram Charan graced the audio launch of his director Sukumar’s latest production “Darshakudu” yesterday and revealed something very personal. While addressing the fans, he equated his Babai with his mother. This interesting incident happened when the fans started shouting Babai - Babai and Ram Charan blushed in the middle of his speech.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu