కరప్షన్ ఎక్కడ? మీరు బ్రతకండి, మమ్మల్ని బ్రతకనివ్వండి: రామ్ చరణ్ హానెస్ట్ స్పీచ్

By Bojja Kumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. మే 4న సినిమా విడుదల చేస్తున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్ హానెస్ట్ స్పీచ్ ఇచ్చారు.

బన్నీని చూసి నేర్చుకో అని డాడీ తిట్టేవాడు

బన్నీని చూసి నేర్చుకో అని డాడీ తిట్టేవాడు

బన్నీ డెడికేషన్ గురించి, బన్నీ పెర్ఫార్మెన్స్ గురించి మేము చూస్తూనే ఉన్నాం. సినిమాల్లోకి రాక ముందు నుండి చూస్తూనే ఉన్నాం. చిన్నపుడు ఏదైనా బర్త్ డే ఫంక్షన్ జరిగేపుడు నేను డాన్స్ చేయడం చాలా తక్కువ. దాన్ని సిగ్గంటారో? ఏమంటారో... రాదని నేను డాన్స్ చేసేవాడిని కాదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ముందడుగు వేసి మమ్మల్ని ఎంటర్టెన్ చేసే వ్యక్తి బన్నీ. ఆ ఉత్సాహం బన్నీలో చిన్నప్పటి నుండి ఉండేది. వాడిని చూసి నేర్చుకోరా అని మా డాడీ తిట్టేవారు.... అని రామ్ చరణ్ తెలిపారు.

అపుడు నాన్నకు ధైర్యం ఇచ్చాడు

అపుడు నాన్నకు ధైర్యం ఇచ్చాడు

చిరుత రిలీజ్ ముందు డాడీ ఒకసారి బన్నీని పిలిచి.... మన ఫ్యామిలీలో డాన్స్ వచ్చనే ఒక మంచి పేరుంది, వీడు చిన్నపుడు ఎప్పుడూ డాన్స్ చేయలేదు. వీడు మన పరువు తీస్తాడా? నిలబెడతాడా? ఏంటి అని అడిగాడు. నాన్నగారికి ఆ రోజు దైర్యం ఇచ్చిన వ్యక్తి బన్నీ. నువ్వు దైర్యంగా ఉండు, వీడు చాలా బాగా చేస్తాడు అని బన్నీ చెప్పడంతో ఆ రోజు నుండి నాన్న నన్ను తిట్టడం మానేశాడు.... అని రామ్ చరణ్ గుర్తు చేసుకున్నారు.

ఈ సినిమా చూస్తుంటే చాలా ఇన్స్ స్పైరింగ్ కాన్సెప్ట్ అనిపిస్తోంది

ఈ సినిమా చూస్తుంటే చాలా ఇన్స్ స్పైరింగ్ కాన్సెప్ట్ అనిపిస్తోంది

నా పేరు సూర్య చాలా నిజాయితీగా తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. నాకు ఎవడు సబ్జెక్ట్ రాసింది వంశీగారే. ఆయన వర్కింగ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఆయనతో చేసిన డైరెక్టర్లు ఆయన రైటింగ్ నుండే ఆ స్టైలిష్ నెస్ వస్తుంది, ఆయన రైటింగ్ నుండే ఆ షార్ప్ నెస్ వస్తుంది అని చెబుతుంటారు. ఈ సినిమా చూస్తుంటే చాలా ఇన్స్ స్పైరింగ్ కాన్సెప్ట్ అనిపిస్తోంది. దర్శకుడిగా వంశీ నెం.1 స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాను.... అని రామ్ చరణ్ అన్నారు.

మీరు బ్రతకండి, మమ్మల్ని బ్రతకనివ్వండి

మీరు బ్రతకండి, మమ్మల్ని బ్రతకనివ్వండి

మామ ఇపుడు కాంట్రవర్సీకి తెరలేపారు. ఆయన ఏం మాట్లాడినా దాని వెనక పెయిన్ అర్థం చేసుకోగలను. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా కరప్షన్ లేని ఇండస్ట్రీ ఈ ప్రపంచంలో ఉందంటే అది సినిమా ఇండస్ట్రీ ఒక్కటే. ఎందుకంటే ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ ఎవరైనా సరే ఉదయం లేచి షూటింగుకు వెళతాం. రోజంతా ఎండనకా, వాననకా కష్టపడతాం. బన్నీకి ఇన్ని సంవత్సరాల్లో డాన్సులు, ఫైట్స్ చేయడం వల్ల చాలా గాయాలైనాయి. మహేష్, తారక్ ఇలా అందరికీ అయ్యాయి.... ప్రభాస్‌కు 2 సార్లు షోల్డర్ ఇంజురీ అయింది. మా నాన్నగారికి, బాలకృష్ణ గారికి షోల్డర్ ఇంజురీ అయింది. ఇలా ఒళ్లు హూనం చేసుకుని కష్టపడుతూ... మళ్లీ ఇంటికొచ్చి నెక్ట్స్ డే ఏం చేయాలి అని వర్కౌట్ చేసుకుని, ఫ్యామిలీతో ఒక గంట గడిపి పడుకుని మళ్లీ ఉదయం లేచి షూటింగుకు వెళతాం. ఇందులో కరప్షన్ ఎక్కడ ఉంది. మీడియాలో కొన్ని సార్లు మా గురించి ఇష్టం వచ్చినట్లు రాస్తుంటారు. ఏందో ఎంటర్టెన్మెంటుగా వాటిని చూస్తారే తప్ప... నిజమైన వ్యక్తి అవేవీ మనసులో పెట్టుకోరు, నమ్మరు. మీడియాకు చెప్పేది ఒకటే... మీరు హ్యాపీగా బ్రతకండి, మమ్మల్ని హ్యాపీగా బ్రతకనివ్వండి.... అని రామ్ చరణ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X