Don't Miss!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
టాక్ ఆఫ్ టాలీవుడ్: మరో అడుగు ముందుకేసిన రామ్ చరణ్.. మెగా వారసుడి తీరు చూస్తుంటే!
కొణిదెల వారసుడు, చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. సినిమా రంగంలో ప్రత్యేకత చాటుకుంటున్నారు. నటుడిగా కెరీర్ కొనసాగిస్తూనే నిర్మాణ రంగంలోనూ సత్తా చాటుతున్నారు. ఓ వైపు నటన, మరోవైపు నిర్మాణం రెండింటా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలు పరభాషా సినిమాలను రీమేక్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.
కొణిదెల ప్రొడక్షన్స్.. చెర్రీ స్టెప్స్
కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ స్థాపించిన రామ్ చరణ్.. నిర్మాతగా కూడా పక్కా ప్రణాళికను రచించుకుంటున్నారు. భారీ సినిమాలను, వైవిద్యభరితమైన సినిమాను నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు అందరు నిర్మాతల్లో తాను ప్రత్యేకం అన్నట్లుగా అడుగులేస్తున్నారు.
చిరంజీవి కల.. తొలి ప్రయత్నంలోనే రామ్ చరణ్
‘ఖైదీ నంబర్ 150' సినిమాతో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీకి కిక్ స్టార్ట్ ఇచ్చారు రామ్ చరణ్. నిర్మాతగా తొలి ప్రయత్నంతోనే హిట్ అందుకొని టాలీవుడ్ పెద్దల చేత భేష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత పీరియాడికల్ మూవీ ‘సైరా నరసింహా రెడ్డి' సినిమాతో నిర్మాతగా స్టామినాను చాటుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందించి చిరంజీవి కల నెరవేర్చారు.
చిరు 152.. చెర్రీ రోల్
ఇక ప్రస్తుతం చిరంజీవి 152 సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు చెర్రీ. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వచ్చింది. చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. నిర్మాత రామ్ చరణ్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్లో కనిపించనుండటం విశేషం.
కొణిదెల ప్రొడక్షన్స్ మూవీ.. చిరంజీవి, రామ్ చరణ్ లీడ్ రోల్స్
ఇకపోతే ఇటీవలే రామ్ చరణ్ ‘లూసిఫర్' సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చి సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రాన్ని తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాడు చెర్రీ. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ లీడ్ రోల్స్ పోషించనున్నారని టాక్.
టాక్ ఆఫ్ టాలీవుడ్.. రామ్ చరణ్ ‘డ్రైవింగ్ లైసెన్స్'
ఇదిలా ఉండగానే రామ్ చరణ్ మరో మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకోవడం టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారింది. మలయాళంలో పృథ్వీరాజ్ హీరోగా ‘డ్రైవింగ్ లైసెన్స్' పేరుతో రూపొంది సక్సెస్ సాధించిన ఈ సినిమాను రామ్ చరణ్ రీమేక్ చేయబోతున్నాడు.
Recommended Video
మెగా వారసుడి తీరు చూస్తుంటే!
ప్రస్తుతం RRR సినిమా షూటింగ్లో పాల్గొంటూనే తన నిర్మాణ సంస్థపై రామ్ చరణ్ పెడుతున్న దృష్టి చూస్తుంటే.. కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరుగా పేరు తెచ్చుకుంటాడని అర్థమవుతోంది. పైగా నిర్మించబోయే సినిమాల ఎంపికలో విలక్షణత చూపుతూ హిట్ సినిమాల రీమక్స్పై రామ్ చరణ్ కన్ను పడుతుండటం ఆసక్తికర అంశం.