»   » ఆ టైటిలే రామ్ చరణ్‌ సినిమాకు ఖరారు చేస్తున్నారట!

ఆ టైటిలే రామ్ చరణ్‌ సినిమాకు ఖరారు చేస్తున్నారట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ స్టంట్ మేన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర పర్ ఫెక్టుగా చేయడం కోసం రామ్ చరణ్ థాయ్ లాండ్ వెళ్లి కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ‘బ్రూస్ లీ' అనే మరో టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కథ ప్రకారం ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ' అనే టైటిలే బెటరని, అదే ఫిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ సమాచారం వెలువడ నుంది.

Ram Charan-Sreenu Vaitla's Film Titled As Bruce Lee

సినిమాలో కూడా రామ్ చరణ్ బ్రూస్ లీ టాటూతో కనిపించబోతున్నారని అంటున్నారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయని, గతంలో ఏ తెలుగు సినిమాలోనూ లేని విధంగా సూపర్బ్ అనిపించే విధంగా స్టంట్స్ మనం ఈచిత్రంలో చూడబోతున్నామని టాక్.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించని షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ లపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ చాలా బాగా వచ్చిందని, దర్శకుడు శ్రీను వైట్ల, రైటర్ గోపీ మోహన్ ఔట్ పుట్ మీద చాలా హ్యాపీగా ఉన్నారని, ముఖ్యంగా రామ్ చరణ్ కామిక్ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టకుంటుందని అంటున్నారు.

English summary
It is known that Ram Charan is playing a stunt man in his next flick with Sreenu Vaitla. He has gone all the way to Thailand and got trained in kick boxing and martial arts to add credibility to his role. Though the film was publicized to be titled as My Name Is Raju, according to a reliable source, the film is said to be titled as Bruce Lee and an official announcement on this will be coming out soon.
Please Wait while comments are loading...