twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ చిత్రం తర్వాత శ్రీను వైట్ల ఆ హీరోతో

    By Srikanya
    |

    జూ.ఎన్టీఆర్ తో ప్రస్తుతం సినిమా చేయటానికి సన్నాహాలు చేస్తున్న శ్రీను వైట్ల తన తదుపరి చిత్రాన్ని కూడా ఓకే చేయించుకున్నారు. ఆ చిత్రంలో హీరోగా రామ్ చరణ్ చేయనున్నారు. దూకుడుతో మహేష్ తో సూపర్ హిట్ కొట్టిన శ్రీను వైట్ల ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ గా మారారు. దాంతో హీరోలంతా అతన్ని పిలిచి తమకు సినిమాలు చేయమని అడుగుతున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా శ్రీను వైట్ల తో పనిచేయటానికి ఆసక్తి చూపటంతో త్వరలోనే వచ్చి స్టోరీ నేరేట్ చేస్తానని శ్రీను హామీ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ మేరకు తన స్టోరీ డిపార్టమెంట్ తో శ్రీను వైట్ల కధా చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే నిర్మాత, మిగతా సాంకేతిక గణం ఎవరన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

    మరో ప్రక్క శ్రీను వైట్ల దర్సకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందే సినిమాకు సంభందించిన స్క్రిప్టు వర్క్ స్పీడుగా జరుగుతోంది. హాస్యనటుడు బండ్ల గణేష్ నిర్మించే ఈ చిత్రం స్క్రిప్ట్ కు ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటున్నాడు. దూకుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీను వైట్ల డైరెక్ట్ చేయబోతున్న జూ ఎన్టీఆర్ సినిమాపై అభిమానుల్లో చాలా ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. శ్రీను వైట్ల తనకీ పెద్ద హిట్ ఇస్తాడని ఎన్టీఆర్ కూడా నమ్ముతున్నాడు. అలాగే ప్రభాస్, అల్లు అర్జున్ కూడా శ్రీను వైట్లతో చేయటానికి చాలా ఆసక్తి చూపిస్తునట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ చాలా భాగం పూర్తైంది.అలాగే వివి వినాయిక్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చిత్రం నిన్న బుధవారం నాడు ప్రారంభమైంది. ఈ చిత్రం కూడా కామిడీ, యాక్షన్ కలగలసిన చిత్రం అని చెప్తున్నారు.

    English summary
    Srinu Vytla will do a film with Ram Charan after he is done with NTR’s movie. Both of them have mutually agreed to work with each other but the producer and script are yet to be finalized.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X