RRRపై అదిరిపోయే అప్డేట్.. రాజమౌళి ఆదేశాలతో బరిలోకి దిగిన రామ్ చరణ్!!

కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ భారత సినీ ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎదురుచూస్తోంది. అసలే రాజమౌళి సినిమాలంటే ఎంతో నిదానంగా నత్తనడకగా సాగుతుంది. షూటింగ్ ఆలస్యమవుతూ ఉంటుంది. దానికి తోడు కరోనా రావడం, లాక్‌డౌన్ పెట్టడంతో ఆర్ఆర్ఆర్ మూలన పడింది. ఇక సినిమా నుంచి చివరగా వచ్చిన అప్డేట్ రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు షూటింగ్ అప్డేడ్ కోసం ఎంతో మంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

రామ్‌కు భీం గిఫ్ట్..

రామ్‌కు భీం గిఫ్ట్..

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పాత్రను పరిచయం చేసే బాధ్యతను భీంగా ఎన్టీఆర్ తన భుజాన వేసుకున్నాడు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఆ టీజర్‌లో రామ్ చరణ్ అద్భుతంగా కనిపిస్తే.. ఎన్టీఆర్ వినిపించాడు. ఇక ఆ వాయిస్‌లోని గాంభీర్యానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఎన్టీఆర్ లుక్‌ కోసం..

ఎన్టీఆర్ లుక్‌ కోసం..

ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ లుక్, కొమురం భీం పాత్రకు సంబంధించిన వీడియో ఏదైనా వస్తుందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌పై కొన్ని షాట్స్ తీయాలని, అది తీశాకే ఫస్ట్ లుక్ గానీ టీజర్ గానీ విడుదల చేయగలమని రాజమౌళి చెప్పుకొచ్చాడు. షూటింగ్‌లు ప్రారంభమైతే తప్పా ఎన్టీఆర్‌ పాత్రపై అప్డేట్ ఇవ్వలేమని తెలిపాడు.

మొదట చేసే పనే అది..

మొదట చేసే పనే అది..

ఒకవేళ షూటింగ్ స్టార్ట్ చేస్తే.. మొదటగా ఎన్టీఆర్‌కు సంబంధించి షూటింగ్ పార్ట్ పూర్తి చేసి అప్డేట్ ఇస్తామని జక్కన్న మాటిచ్చాడు. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందో మాత్రం చెప్పలేదు. అసలే దర్శకధీరుడు కూడా ఈ మధ్యే కరోనా నుంచి కోలుకున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోన్నట్టు కనిపిస్తోంది.

Recommended Video

Amaram Akhilam Prema Would Be Released On September 18 In Aha
జిమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ..

జిమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ..

షూటింగ్ స్టార్ట్ చేసే ముందే వర్కౌట్లు చేస్తామని, లేదంటే మళ్లీ బాడీ షేప్ మారిపోతుందని అప్పట్లో రామ్ చరణ్ చెప్పాడు. రాజమౌళి సైతం అదే విషయం చెబుతూ గతంలోనూ ఇలానే ఓ రెండు సార్లు వాళ్లని అలర్ట్ చేశాను.. వారు కూడా బాగానే వర్కౌట్లు చేశారు.. కానీ షూటింగ్ క్యాన్సిల్ అయింది. అందుకే ఈసారి మాత్రం అంతా పక్కా అయితే జిమ్‌లోకి అడుగుపెట్టమని చెబుతానని రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్ జిమ్‌లోకి అడుగపెట్టడంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోందని అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X