పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, రామ్ చరణ్ పరామర్శ.. కాలుకు కట్టుతో చరణ్ (ఫోటోస్)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జిమ్ చేస్తుండగా కాలికి గాయం కావడంతో 'RRR' మూవీ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. మూడు వారాల తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభం కానుంది. రెస్ట్ తీసుకునేందుకు హైదరాబాద్ వచ్చిన చరణ్... బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని విజయవాడ బయల్దేరి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ కూడా జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

రామ్ చరణ్ ప్రస్తుతం సరిగా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రచార పర్వంలో తన వంతు సహాయం అందించడానికి నడుంబిగించాడు. క్రింద కనిపిస్తున్న ఫోటో చరణ్ కాలికి కట్టు ఉన్న దృశ్యాన్ని గమనించవచ్చు.

గాజు గ్లాసు హోర్డింగ్ పక్కన రామ్ చరణ్

గాజు గ్లాసు హోర్డింగ్ పక్కన రామ్ చరణ్

‘జనసేన' పార్టీ ఎన్నికల సింబల్ గాజుగ్లాసు హోర్డింగ్ ఏర్పాటు చేయగా దాని పక్కనే నిల్చుని రామ్ చరణ్ స్టైలిష్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. తాను ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వచ్చాను అని మెగా అభిమానులకు సందేశం ఇవ్వడానికే చరణ్ ఈ ఫోజు ఇచ్చినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్‌కు స్వాగతం

రామ్ చరణ్‌కు స్వాగతం

‘జనసేన' పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన రామ్ చరణ్‌కు పార్టీ శ్రేణులు సాదర స్వాగతం పలికారు. చరణ్‌కు పూల బొకే ఇచ్చి ఆహ్వానిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ ఫోటోల్లో చూడొచ్చు. రామ్ చరణ్ రాకతో జనసేన శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొని ఉంది.

కాలికి గాయమైనా...

కాలికి గాయమైనా...

జిమ్ చేస్తుండగా చరణ్ కాలి చీలమండలానికి గాయమైంది. దీని కారణంగా చరణ్ సరిగ్గా నడవలేక పోతున్నారు. అందుకే షూటింగ్ వాయిదా వేశారు. అయితే ఎన్నికల ప్రచారం నడుస్తూ కాకుండా కారులో తిరుగుతూ చరణ్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

బాబాయికి పరామర్శ

బాబాయికి పరామర్శ

ఎడతెరిపి లేకుండా ఎన్నికల ప్రచారం చేయడం కారణంగా అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్‌ను రామ్ చరణ్ పరామర్శించారు. ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయమే ఉండటంతో పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు.

వైద్యులు వద్దన్నా బాబాయ్ వినడం లేదు: రామ్ చరణ్

‘‘వడ దెబ్బ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన బాబాయ్‌ని వైద్యులు ప్రచారం నిలిపి వేసి విశ్రాంతి తీసుకోవాలని కోరారు. కానీ పొలిటికల్ కమెంట్మెంట్స్, సమయం తక్కువగా ఉండటంతో బాబాయ్ వారి మాట వినడం లేదు. ఈ రోజు ఆయన అనకాపల్లి, పెందుర్తిలో ప్రచారం చేస్తారు. ప్రచార సమయంలో వైద్యులు తన వెంట ఉంటానని చెప్పినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. బాబాయి త్వరగా కోలుకోవాలని, విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు ఆయన సేవలు ఎంతో అవసరం.’’ అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X