రాంచరణ్ మొదలెట్టేశాడు.. ఉపాసన కన్ఫర్మ్ చేశారు!
రంగస్థలం అందించిన సక్సెస్ జోష్‌తో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్‌కు రాంచరణ్ హాజరయ్యారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకునే చిత్రంలో కియారా అద్వానీ, వివేక్ ఒబెరాయ్, మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా రమ్యకృష్ణ కీలకపాత్రను పోషిస్తున్నారు. భరత్ అనే నేను లాంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఆదివారం నుంచి రాంచరణ్ షూటింగ్‌కు హాజరవుతున్నారు. ఇప్పటివరకు సినిమాలో కీలకంగా ఉండే రెండు యాక్షన్ సీన్లను తెరెక్కిస్తున్నారు. ఇతర నటీనటులతో ఉండే కాంబినేషన్ సీన్లు ఈ షెడ్యూల్‌లోనే తెరకెక్కిస్తాం అని చిత్ర యూనిట్‌కు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి.
బోయపాటి సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో రాంచరణ్‌కు బెస్టాఫ్ లక్ చెబుతూ ఆయన సతీమణి ఉపాసన ట్వీట్ చేసింది. ఆర్సీ (రాంచరణ్) 12వ ప్రాజెక్ట్‌కు రెడీ అయ్యారు. గుడ్ లక్ రాం చరణ్ అని ట్వీట్‌లో ఉపాసన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











