»   »  వెరైటీగా ఉంది: రామ్ చరణ్-సుకుమార్ మూవీ టైటిల్ ప్రకటన!

వెరైటీగా ఉంది: రామ్ చరణ్-సుకుమార్ మూవీ టైటిల్ ప్రకటన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ఖరారైంది. ఈ చిత్రానికి 'రంగస్థలం 1985' అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ కింద 1985 అనే సంవత్సరం ఉంది కాబట్టి ఈ సినిమా అప్పటి పరిస్థితుల నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

'రంగస్థలం' అసలు ఇలాంటి టైటిల్ ప్రకటిస్తారని అటు అభిమానులు గానీ, ఇటు ఇండస్ట్రీకి చెందిన వారుగానీ ఊహించలేదు. రంగస్థలం అంటే నాటకాలు వేసే స్టేజ్, లేదా ఏదైనా కళలను ప్రదేశించే వేదిక అని అర్థం. మరి ఈ సినిమా నేపథ్యం ఎలా ఉంటుంది? అనేది ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

రంగస్థలం

టైటిల్ ప్రకటించగానే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగా అభిమానులు లైక్స్, కామెంట్లతో హోరెత్తించారు. అయితే కొందరు ఈ టైటిల్ చాలా ఓల్డ్ గా ఉందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం చేశారు.

సంక్రాంతి బరిలో..

సంక్రాంతి బరిలో..

2018 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా రామ్ చరణ్ ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాతి బరిలో మెగాస్టార్ నిలిస్తే.... 2018 సక్రాంతి బరిలో రామ్ చరణ్ పోటీ దారులకు గట్టి కాంపిటీషన్ ఇవ్వనున్నాడన్నమాట.

పల్లెటూరి నేపథ్యం

పల్లెటూరి నేపథ్యం

పల్లెటూరి నేపథ్యంతో ‘రంగస్థలం' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ను ఓ డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నాడు సుకుమార్. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా లీక్ అయ్యాయి.

భిన్నమైన రోల్

భిన్నమైన రోల్

రామ్ చరణ్ తన కెరీర్లో ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని ఓ భిన్నమైన క్యారెక్టర్ ఇది. ఇందులో రామ్ చరణ్ మాటతీరుగానీ, బాడీ లాంగ్వేజ్ గానీ చాలా భిన్నంగా ఉంటుందని, అభిమానులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

స్టోరీ అదేనా?

స్టోరీ అదేనా?

ఈ సినిమా స్టోరీపై రకరకాల ప్రచారం ఉంది. హీరో పల్లెటూరి అబ్బాయి. అతడు చెవిటివాడు. అమాయకుడైన పల్లెటూరి యువకుడు పట్నంలో అడుగుపెట్టాల్సి వస్తుంది. అక్కడ ప్రయోగశాలతో చేరిన అతడిపై ఓ ప్రయోగం జరుగుతుందట. ఆ తర్వాత హీరో జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులు.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే స్టోరీ అంటూ ఓ రూమర్ ప్రచారంలో ఉంది.

సమంత మూగ?

సమంత మూగ?

80ల నాటి పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని...., హీరోకు చెవుడు, హీరోయిన్ మూగ అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

మైత్రి మూవీ మేకర్స్

మైత్రి మూవీ మేకర్స్

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

రావు రమేష్ ఔట్

రావు రమేష్ ఔట్

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ సమంత తండ్రిగా నటిస్తున్న ప్రముఖ నటుడు రావు రమేష్ ఉన్నట్టుండి తప్పుకున్నారని, ఆయన స్థానంలో ప్రకాష్ రాజ్ ను తీసుకుంటున్నట్లు టాక్. సినిమా సగం షూటింగ్ అయిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది. దర్శకుడితో విబేధాల కారణంగానే రావు రమేష్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రీ షూట్

రీ షూట్

మళ్లీ రీ షూట్ రావు రమేష్ మీద ఇప్పటికే కొన్నీ సీన్లు తీసారని, అయితే ఆ సీన్లను ప్రకాష్ రాజ్ తో మళ్లీ రీ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతకు ఇది అదనపు భారమే అని అంటున్నారు.

గతంలో కూడా ఇలానే...

గతంలో కూడా ఇలానే...

రామ్ చరణ్ గతంలో నటించిన ‘గోవిందుడు అందరి వాడే' విషయంలో కూడా ఇలానే జరిగింది. ఇందులో మొదట తమిళ నటుడు రాజ్ కిరణ్ ను తీసుకోగా ఆయన్ను తప్పించి ప్రకాష్ రాజ్ తో ఆ పాత్ర చేయించిన సంగతి తెలిసిందే.

English summary
Ram Charan-Sukumar's next, 'RC 11', the movie in which Ram Charan is going to look in an all new avatar is announced title 'Ranga Stalam 1985'. Ratnavelu will crank the camera and Devi Sri Prasad will score music for it. The movie all set to release for Sankranthi 2018.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu