రంగస్థలం 100 డేస్: రామ్ చరణ్ స్పీచ్ అదుర్స్, అనసూయ జిగేల్ డాన్స్ పెర్ఫార్మెన్స్

By Bojja Kumar

Recommended Video

Ram Charan Superb Speech at Rangasthalam 100 Days Celebrations

రామ్ చరణ్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, సమంత, అనసూయ ప్రధాన తారాగణంగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ రూపొందించిన 'రంగస్థలం' 100 రోజుల వేడుక హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సినిమా సక్సెస్ అనేది వన్ మ్యాన్ డ్రీమ్... ఆ వన్ మ్యాన్ సుకుమార్. ఆయన ఆలోచన, రైటింగ్ నుండే ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది అన్నారు. ఈ వేడుకలో అనసూయ తన డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది.

మనం పడిపోతే కాపాడేది ఆ పది మందే..

మనం పడిపోతే కాపాడేది ఆ పది మందే..

నాన్నగారు తిరిగి ఖైదీ నెం 150 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినపుడు ఓ విషయం గమనించాను... ఒక వ్యక్తికి ఇంత ఆదరణ, ప్రేమ కేవలం మంచి సినిమాల వల్లనో, గ్రేట్ క్యారెక్టర్ల వల్లనో రాదు. ఆయన ఒకటే అనేవారు... మనం ఎదిగేటపుడు మనతో పాటు పది మందిని పైకి తీసుకెళ్లాలి. ఒక వేళ మనం పడిపోతే ఆ పది మందే మనల్ని కాపాడుతారు అని చెప్పేవారు... మా ఇండస్ట్రీని, మమ్మల్ని కాపాడేవారు మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్... అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.

ఇండస్ట్రీలో సక్సెస్ ఇలాగే కొనసాగాలి

ఇండస్ట్రీలో సక్సెస్ ఇలాగే కొనసాగాలి

డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్ సంతోషంగా ఉంటేనే మేమంతా సంతోషంగా ఉంటాం. రంగస్థలం ద్వారా వారికి మంచి ప్రాఫిట్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సినిమా వారికి ఇలాగే మంచి లాభాలు తేవాలని, మన ఇండస్ట్రీ ఎంతో బావుండాలని, పరిశ్రమలో సక్సెస్ అనేది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... అని రామ్ చరణ్ అన్నారు.

అందరి కృషి వల్లనే ఇది సాధ్యమైంది

అందరి కృషి వల్లనే ఇది సాధ్యమైంది

వంద రోజులు సినిమా ఆడిందంటే దీని వెనక ఎంతో మంది కృషి, ప్రయత్నం ఉంటాయి. దర్శకుడు సుకుమార్ దగ్గర నుండి నటీనటులు, టెక్నీషియన్స్ ఇలా సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ కష్టపడటం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరింత ప్లస్సయింది. రంగమ్మత్త క్యారెక్టర్లో అనసూయ అద్భుతంగా చేసింది. ఇవన్నీ బాగా సెట్టవ్వడం వల్లే సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది అని రామ్ చరణ్ అన్నారు.

ఈ విజయానికి రామ్ చరణే కారణం: సుకుమార్

ఈ విజయానికి రామ్ చరణే కారణం: సుకుమార్

‘క‌థ విన్న వెంట‌నే చ‌ర‌ణ్ ఓకే చెప్పి ఉండ‌క‌పోతే.. వేరే క‌థ‌తో సినిమా చేసేవాడిని. అయితే రంగ‌స్థలం సినిమా రావ‌డానికి ముఖ్య కార‌ణం చ‌ర‌ణే. నిర్మాత‌లు నవీన్‌, ర‌వి, మోహ‌న్‌గారు.. చాలా అంద‌మైన నిర్మాత‌లు. ఎప్పుడూ న‌వ్వుతూ ఉంటారు. ఇంత మంచి ప్రాజెక్ట్ చేసే అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ర‌త్న‌వేలు లేకుండా విజువ‌ల్స్ ఇంత బాగా వ‌చ్చేవి కావు. దేవిశ్రీ ప్ర‌సాద్ నా ఆత్మ‌. అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. ప్రేక్ష‌కుల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి, ఎగ్జిబిట‌ర్స్‌కి... సినిమా మేకింగ్‌లో స‌పోర్ట్ చేసిన అంద‌రికీ పేరు పేరునా థాంక్స్‌' అని సుకుమార్ తెలిపారు.

అనసూయ లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్

ఈ సందర్భంగా రంగమ్మత్త అనసూయ డాన్స్ మాస్టర్లు జానీ, శేఖర్‌తో కలిసి రంగస్థలం సినిమాలోని పాటలకు స్టెప్పులు వేస్తూ అలరించారు.

రామ్ చరణ్ మా జీవితంలో మరిచిపోలేనపి మూమెంట్

రామ్ చరణ్ మా జీవితంలో మరిచిపోలేనపి మూమెంట్

నిర్మాత న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ ``ఈరోజుల్లో వంద‌రోజులు సినిమాలు ఆడుతున్నాయా? అలాంటి ఈరోజుల్లో వంద‌రోజుల సినిమాను ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ స‌హా అందరికీ స్పెష‌ల్ థాంక్స్‌. మా జీవితంలో మరిచిపోలేని మూమెంట్‌. ఇదొక అద్భుతం. ప్రేక్ష‌కుల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ థాంక్స్‌`` అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X