వాళ్ళపై బ్యాన్ పెట్టాల్సిందే:రామ్ చరణ్
యంగ్ హీరోల్లో రామ్ చరణ్ చాలా చురుగ్గా ఇండస్ట్రీ వ్యవహారాల్లో మూవ్ అవుతున్నారు. తాజాగా అవుట్ సైడ్ ఆర్టిస్టులపై బ్యాన్ పెట్టాలా వద్దా అని చర్చ జరుగుతున్న నేపధ్యంలో ధైర్యంగా బయిటనుంచి వచ్చే ఆర్టిస్టులపై బ్యాన్ పెట్టి ఇక్కడ లోకల్ వారిని ప్రమేట్ చెయ్యాల్సిందే అన్నారు. ఆయన మాటల్లోనే... బయిట వాళ్ళపై బ్యాన్ పెట్టాలనే రూల్ తప్పనిసరిగా ఇక్కడుండే లోకల్ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేస్తుందని నమ్ముతున్నాను.ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది అన్నారు. ఇక ఈ ప్రపోజల్ ని మూవీ ఆర్టిస్ట్ అశోషియేషన్ వారు పెట్టారు. దాంతో వారు నిర్మాతల మండిలితో చర్చలు జరుపుతున్నారు. తమిళ, హిందీ, మళయాళ పరిశ్రమలనుంచి విలన్స్ ని, హీరోయిన్స్ ని తెచ్చుకోవటంపై వారు బ్యాన్ పెట్టాలని భావిస్తున్నారు.
అయితే బయిట భాషల నుంచి వచ్చే కొరియోగ్రాఫర్స్, దర్శకులు, స్టంట్ మాస్టర్స్ పై బ్యాన్ గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే వారిపై బ్యాన్ పెడితే చాలా మంది పెద్ద హీరోలు సినిమాలుకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష్యుడు సురేష్ బాబు మాట్లాడుతూ... ఇలాంటి రూల్ ని అమలు చేయటం చాలా కష్టమని అనుకుంటున్నాను. లోకల్ ట్యాలెంట్ ని తప్పనిసరిగా ఎంకరేజ్ చేయాలి. ప్రతిభావంతులకు ఎక్కడైనా బ్రతుకుతారు. వారిని ప్రతి పరిశ్రమ పని ఇచ్చి గౌరవిస్తుంది. అంతెందుకు హిందీ పరిశ్రమ బయిట వారెవ్వరూ మా సినిమాల్లో చేయకూడదు అంటే మా అబ్బాయి రాణా పరిస్ధితి ఏమౌతుంది అని ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











