థాంక్యూ రామ్ చరణ్ గారు.. పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్

కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్నందుకు, ప్రజలంతా ఒకేత్రాటిపై ఉన్నారని ప్రపంచానికి చాటు చెప్పేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశ ప్రజలంతా ఒంటరి వారు కారని, తామంతా ఒక్కటేనని, తమ సమగ్రతను చాటి చెప్పాలని, అందుకు ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు ఇంట్లో లైట్స్ ఆర్పివేసి దీపాలను వెలిగించాలని ప్రధాని సూచించిన సంగతి తెలిసిందే.

ప్రధాని ఇచ్చిన ఈ సందేశానికి సెలెబ్రిటీలంతా తమ మద్దతును ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అందరూ ప్రధాని నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్, రంగోలీ చందేల్ ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలని సూచించారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ప్రధాని నిర్ణయానికి జై కొట్టారు.

 Ram Charan Supports Narendra Modi 9 Baje 9 Minutes

తాజాగా రామ్ చరణ్ సైతం ప్రధాని నిర్ణయానికి మద్దతు తెలుపుతూ.. ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. ప్రధాని చెప్పినట్టు ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు ఇంట్లోని లైట్స్ ఆర్పి వేసి దీపాలు వెలిగిద్దామని అభిమానులకు సూచించాడు. మనమంతా కలిసి కరోనా లేని భారతాన్ని చూడాలని కాంక్షించాడు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ప్రధాని నిర్ణయాన్ని సమర్థించినందుకు థాంక్యూ రామ్ చరణ్ గారూ..అంటూ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X