twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రియల్ ఫోటో.. లెజెండ్స్‌కి మరణం లేదన్న రాంచరణ్!

    |

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి తనయుడు రాంచరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తుండడం విశేషం. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. నరసింహారెడ్డి వీరత్వాన్ని ప్రతిభింబించేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 22న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా సైరా చిత్ర యూనిట్ ఈ వీరుడుకి నివాళులు అర్పించింది.

    ఉరితీశారు

    1847, ఫిబ్రవరి 22న అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరితీసింది. మరణించే వరకు కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఇలాంటి మహావీరుడి చరిత్రని సైరా చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా సైరా టీమ్ నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. స్వాతంత్ర సమరానికి ఆద్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం అని సైరా టీం పోస్ట్ చేసింది.

    లెజెండ్స్‌కి మరణం లేదు

    లెజెండ్స్‌కి మరణం లేదు

    సైరా నరసింహారెడ్డి నిర్మాత రాంచరణ్ లెజెండ్స్ కి మరణం లేదు అంటూ తన పేస్ బుక్ పేజీలో కామెంట్ పెట్టాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రియల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ ఫోటోని ట్వీట్ చేశారు. ఆయన సాహసాలని ఎవరూ గుర్తించని హీరో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని సురేందర్ రెడ్డి కామెంట్ చేశారు.

    రాష్ట్రప్రభుత్వం అధికారికంగా

    రాష్ట్రప్రభుత్వం అధికారికంగా

    దక్షణాది ఉయ్యాలవాడ సేవాసమితి కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చేసిన పోరాటం ఫలించింది. పలుమార్లు ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. దీనితో కొన్నిరోజుల క్రితమే ప్రభుత్వం ఉయ్యాలవాడ వర్ధంతి రాష్ట్ర కార్యక్రమంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఉయ్యాలవాడ వర్ధంతిని అన్ని జిల్లాలో అధికారికంగా నిర్వహిస్తున్నారు.

     పార్లమెంట్‌లో విగ్రహం

    పార్లమెంట్‌లో విగ్రహం

    అదే విధంగా ఉయ్యాలవాడ చరిత్రని పాఠ్యపుస్తకాలలో చేర్చాలని, ఆయన్ని ఉరితీసిన జరేటి వాగు వద్ద స్మృతి వనం, పార్లమెంట్ లో విగ్రహం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలసి విన్నవించారు. ఇక చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానుంది.

    English summary
    Ram Charan and Surender Reddy about Uyyalavada Narasimhareddy on his Martyrdom
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X