గీతా ఆర్ట్స్: సురేందర్ రెడ్డి దర్వకత్వంలో రామ్ చరణ్!
దరాబాద్: గీతా ఆర్ట్స్ బేనర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. ఇటీవలే ‘రేసు గుర్రం' సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డి రామ్ చరణ్ కోసం అదిరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారు.
రామ్ చరణ్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. సురేందర్ రెడ్డి ‘కిక్ 2' సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఇద్దరూ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేసుకున్న తర్వాత సినిమా ప్రారంభం కానుంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

రామ్ చరణ్-శ్రీను వైట్ల సినిమా విషయానికొస్తే...ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే రామ్ చరణ్ తో ఆమె చేస్తున్న తొలి సినిమా ఇదే కానుంది. సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్.
సినిమాకు సంబంధించిన పేపర్ వర్క్ కంప్లీట్ కావాల్సి ఉందని, జనవరి సెకండ్ వీక్ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


Click it and Unblock the Notifications











