సూపర్ స్టార్ ఆశీస్సులు తీసుకున్నాకే చెర్రీ
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆశిస్సులు తీసుకున్నాక మాత్రమే జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ మొదలెడతారని బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి. అలాగే చిత్రం షూటింగ్ 13 మార్చి నుంచి మొదలుకానుంది. అమితాబ్ సూపర్ హిట్ 'జంజీర్'రీమేక్ గా రూపొందే ఆ చిత్రంతో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్ మెహ్రా నిర్మాత.
అలాగే ఈ రీమేక్‌లో అమితాబ్ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్ సమాచారం. ఈ విషయమై దర్శకుడు అపూర్వ లఖియా ని మీడియా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు. 1973లో అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రమిది. ఆ కథతోనే తాజా చిత్రం రూపొందుతోంది.
ఈ విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ..నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. ఇక మిగతా వివరాలు చెప్పటానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఈ జంజీర్ చిత్రం రీమేక్ ని రిలియన్స్ బ్యానర్ పై అమిత్ మెహ్రా నిర్మించనున్నారని,అపూర్వ లకియా దర్శకత్వంలో రూపొందనుంది.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై జంజీర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications











