వెబ్ సైట్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటానంటున్న రామ్ చరణ్
రామ్ చరణ్ తేజ తాజాగా ఓ వెబ్ సైట్ పై విరుచుకుపడుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. నేను చాలా ఆశ్చర్యపోయాను...కొన్ని ఆధారంలేని, స్టుపిడ్ రూమర్స్ ని ఓ వెబ్ సైట్ వారు రాసారని తెలిసికొని..వారిపై నేను తప్పని సరిగా లీగల్ యాక్షన్ తీసుకుంటాను అన్నారు. ఇక ఆ మద్యన కూడా సాక్షి ఛానెల్ తన సినిమా ఆరెంజ్ గురించి నెగిటివ్ గా ప్రసారం చేసిందని, అది ఓ ఇడియాటిక్ ఛానెల్ అని స్పందించారు. అయితే ఆ వెబ్ సైట్ ఏమిటన్నది మాత్రం రామ్ చరణ్ చెప్పలేదు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్...మెరుపు చిత్రం చేస్తున్నారు. బంగారం దర్శకుడు ధరణి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందుతోంది. మరో ప్రక్క బృందావనం దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా రామ్ చరణ్ ని ట్రై చేస్తున్నారు.
రామ్ చరణ్ తేజ్ ట్విట్టర్ వంశీ పైడిపల్లి సాక్షి ఛానెల్ ram charan teja twitter vamsi paidipalli sakshi channel


Click it and Unblock the Notifications