హీరోగా ఎదగాలంటే నటన ఒకటే సరిపోదు..రామ్ చరణ్
'హీరోగా ఎదగాలనుకునేవాడు గొప్పనటుడై వుంటే సరిపోదు. గొప్ప వ్యక్తి అయి వుండాలి. నేను హీరో కాకముందు నాన్నగారు నాతో తరుచూ ఈ మాట అంటుండేవారు అన్నారు రామ్ చరణ్. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా నటించిన వారేవా చిత్రం ఆడియో వేడుకకు హాజరైన రామ్ చరణ్ పై విధంగా స్పందించారు. అలాగే...నేను చేసిన మూడు సినిమాల్లో బ్రహ్మానందం గారితో చేసాను. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన తనయుడు గౌతమ్ నటించిన ఈ చిత్రం తప్పక విజయం సాధించాలి' అన్నారు.
అనంతరం నాగార్జున మాట్లాడుతూ 'నాగచైతన్య హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పుడు తండ్రిగా నేనెంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు. ఆ సమయంలోనే తోటి హీరోలందరూ ఫోన్ చేసి మరీ నాకు ధైర్యం చెప్పారు. మా మధ్య ఎంత పోటీవాతావరణం వున్నా పిల్లలవిషయంలో మాత్రం అందరం సక్సెస్ కావాలనే కోరుకుంటాం. అందుకే చిరంజీవి తరుపున, బాలకృష్ణ తరుపున, మోహన్ బాబు తరుపున, వెంకటేష్ తరుపున బ్రహ్మానందం గారి అబ్బాయి గౌతమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. అన్నారు.


Click it and Unblock the Notifications











