'ఆరెంజ్' క్లిక్ అవ్వాలంటే మరో నాలుగు రోజులు...రామ్ చరణ్
నా అభిప్రాయమేంటంటే... ఆరెంజ్ లాంటి సినిమాలు ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే నాలుగైదు రోజులు సమయం పడుతుంది అంటున్నారు రామ్ చరణ్. ఆరెంజ్ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ప్రతి ఒక్కరికీ జీవితం మీద ఒక్కో ఫిలాసఫీ ఉంటుంది. ఏ ఇద్దరికీ ఒకే ఫిలాసఫీ ఉండకపోవచ్చు. 'ఆరెంజ్'లో రామ్ అనే కుర్రాడికి ప్రేమపై ఉన్న అభిప్రాయాలతో తెరకెక్కింది. అందులో చెప్పిన ప్రేమ సిద్ధాంతం కొందరికి వెంటనే అర్థం కాకపోవచ్చు. కానీ నేటి తరం ఆలోచనకి దగ్గరగా ఉంటుంది. యూత్‌కి బాగా నచ్చింది అన్నారు.
అలాగే ఈ చిత్రంలో డ్యాన్స్‌ల విషయంలో స్త్టెల్ మార్చానంటూ.. కథ తరహాలోనే డాన్స్ లు కొత్తగా ఉండాలని ప్రయత్నించాం. ప్రేక్షకులు కూడా చాలా బాగున్నాయని అంటున్నారు. కరెంట్ షాక్ కొట్టి కిందపడి గిలగిల కొట్టుకొంటున్నట్టు, చీపురు అవసరం లేకుండా నేలపై ఊచ్చినట్టుండే.. నృత్యాలకు గుడ్‌బై చెప్పాలనుకొన్నాం. వాటిని చేస్తున్న మాతో పాటు, చూస్తున్న ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేసింది. నేనూ, బన్నీ, తారక్, ప్రభాస్... మేమంతా ఇటీవల ఓ వేడుకలో కలుసుకొని ఇదే విషయం మాట్లాడుకొన్నాం అన్నారు.


Click it and Unblock the Notifications











