అలా ప్రపోజ్ చేసా:లవ్ మ్యాటర్ పై రామ్ చరణ్
ఇద్దరికీ ఒకరిపై ఒకరికి చెప్పలేనంత ప్రేమ. కానీ చాలాకాలం అది మనసులు దాటలేదు. ప్రపోజ్ చేయడంలో ఇద్దరిదీ తడబాటే. ఇక లాభం లేదని... ఓ ఫైన్ డే నేనే చెప్పేశా. ఉపాసన కళ్లు ఆనందంతో చెమర్చాయి. వెంటనే ఓకే అనేసింది అంటూ తన ప్రేమను ఎట్లా ప్రపోజ్ చేసారో రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన గో గ్రీన్, సురేందర్‌రెడ్డి హెర్బల్‌పార్కును మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ ఇలా స్పందించారు.
ఉపాసన నాకు మంచి స్నేహితురాలు. సాప్ట్ గర్ల్. ఆమెకు నా గురించి అన్నీ తెలుసు. ఆరేళ్ల మా పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరం పెళ్లి చేసుకొంటున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది అంటూ రామ్ చరణ్ తన మనస్సు విప్పి చెప్పుకొచ్చారు.
అలాగే ఉపాసనకు ప్రకృతిపై మక్కువ ఎక్కువ. జంతువులను ప్రేమిస్తుంది. బుక్స్ కలెక్ట్ చేసి లేనివారికి ఇస్తుంది. ఈ అభిరుచులు మా మనసులను దగ్గర చేశాయి. ఆమె అడుగుజాడల్లో నేను కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని నిర్ణయించుకున్నా అన్నారు.
అలాగే ఆమె నేనూ...ఎప్పుడు కలిసినా జోక్స్ వేసుకుంటూ జాలీగా గడుపుతాం. ఎక్కువగా తనే మాట్లాడుతుంది. ఆమె మాటల్లో ఎంతో నిజాయితీ. నా సినిమాలన్నా మహా ఇష్టం. మా ఇద్దరిదీ పర్‌ఫెక్ట్ మ్యాచ్ అని రెండు కుటుంబాలు నిర్ణయించిన తరువాతనే మూడుముళ్ల బంథానికి గ్రీన్ సిగ్నల్ పడింది. ఇక పెళ్లి విషయాలన్నీ మా పెద్దలకే వదిలేశాం. ఎంగేజ్‌మెంట్ కోసం వచ్చే నెలలో షాపింగ్ చేస్తా. నవంబర్ చివరి లేదంటే డిసెంబర్ మొదటివారంలో మా నిశ్చితార్థం ఉంటుంది. పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు. అయితే కొత్త పంచాంగాలు వచ్చిన తరువాతే ముహూర్తం ఉండొచ్చు అని తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications











