శ్రీవారి కోసం చరణ్-తమన్నా....

రచ్చ సినిమాకు ఏమైంది ఈ వేళ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన తమన్నా రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రంలో తన తండ్రి చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని ఓ పాట రీమిక్స్ లో చరణ్ స్టెప్పులేయనున్నాడు. చిరంజీవి నటించిన 'ఘరానా మొగుడు' సినిమాలోని 'బంగారు కోడీ పెట్ట…' పాటను రీమిక్స్ చేసి 'మగధీర' సినిమాలో స్టెప్పులేసి క్రేజ్ పెంచుకొన్న మెగాపవర్ స్టార్ మళ్ళీ రచ్చతో రచ్చచేసేయనున్నాడు. రచ్చ సినిమాను మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై ప్రసాద్ జైన్, ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆర్ బి చౌదరి ఈ చిత్రానికి సమర్పకులు. మణి శర్మ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











