గోవా రొమాంటిక్ ప్లేస్ లో రామ్ చరణ్-తమన్నాల రొమాన్స్...!?
మనవాళ్ళు షూటింగ్ లు కోసమని విదేశాలు వెళ్లడం కామనే. కాని తెలుగు డైరెక్టర్లు, హీరోలు బ్యాంకాక్ ఫ్రిఫర్ చేస్తారు. కానీ వెరైటీగా రామ్ చరణ్ చైనా లో షూటింగ్ పూర్తి చేసుకొచ్చాడని సమాచారం. చైనాలో షూటింగ్ చేయడం అరుదు. తెలుగు సినిమాలలో ఏదీ చైనాలో షూటింగ్ జరుపుకోలేదు, ఆ మాటకొస్తే ఏ బాలీవుడ్ సినిమా కూడా షూటింగ్ జరుపుకున్న దాఖలా లేదు. కానీ కొత్త లోకేషన్లు కోసం జల్లెడ పడుతున్న తెలుగు హీరోలు మాత్రం గ్రీస్, ఈజిప్ట్ తో సహా అన్ని దేశాలు చుట్టేస్తున్నారు. రామ్ చరణ్ మరో అడుగు ముందుకేసి మన దేశానికి పెద్దగా పొసగని చైనాలో కూడా షూటింగ్ చేసుకొచ్చారు.
కాగా రామ్ చరణ్ తేజా, తమన్నా జంటగా రూపొందుతున్నఈ 'రచ్చ' సినిమా షూటింగ్ త్వరలో గోవాలో జరుగనుంది. అక్కడి అందమైన లొకేషన్లలో హీరో హీరోయిన్లపై ఓ పాటను, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగు ఇంతకు ముందు శ్రీలంక, బ్యాంకాక్ లలో జరిగిన సంగతి తెలిసిందే. 'ఏమైంది ఈ వేళ' ఫేం సంపత్ నంది డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇటీవల వచ్చిన 'రంగం' ఫేం అజ్మల్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. ఎన్ వి ప్రసాద్, పరాస్ జైన్ నిర్మాతలుగా మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











