శ్రీవారిని దర్శించుకొన్న రామ్ చరణ్-తమన్నా.. !
హీరో హీరోయిన్లు రామ్ చరణ్ తేజ్, తమన్నా కలిసి నిన్న సాయంకాలం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 'రచ్చ' సినిమా షూటింగు కోసం తిరుపతి వచ్చిన ఈ జంట పనిలో పనిగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మీడియా చరణ్ తో మాట్లాడడానికి ప్రయత్నించగా, మాట్లాడడానికి ఆయన నిరాకరించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, 'ఏమైంది ఈవేళ' ఫేం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'రచ్చ' సినిమా షూటింగు ఇటీవల చైనాలో కూడా జరిగిన సంగతి మనకు తెలిసిందే. అక్కడ రెండు పాటలు, యాక్షన్ దృశ్యాలు చిత్రీకరించారు. ఇప్పుడు తిరుపతి సమీపంలోని తలకోన ఫారెస్ట్ లో కూడా కొన్ని యాక్షన్ దృశ్యాలు ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.
కాగా రామ్ చరణ్, ఉపాసనా తో పాటు రాణా, అల్లు అర్జున్ లతో కలిసి గత శని ఆదివారం బ్యాచులర్ పార్టీ ని గోవాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొన్నట్టు సమాచారం. రాణా దగ్గరుండి అన్ని కార్య క్రమాల్ని చూసుకొన్నట్టు సమాచారం . చరణ్ కోసం ముంబాయ్ నుండి, హైదరాబాద్ కు ఒక్క రోజు ముందుగానే చేరుకొన్నాడు. రామ్ చరణ్ మాట్లాడుతూ త్వరలో మెగా ఫ్యాన్స్ కొరకు గ్రాండ్ పార్టీ తిరుపతి లో ఇవ్వనున్నట్లు తెలియజేశారు.
తమన్నా, అజ్మల్ అమీర్ ప్రధాన పాత్రల్లో మెగాసూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ లో నిర్మితమైతున్న ఈ చిత్రాన్ని మహాశివరాత్రి2012కి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











